భార్యతో గొడవపడి విద్యుత్‌ స్తంభమెక్కిన మందుబాబు

ABN , First Publish Date - 2022-11-17T00:02:56+05:30 IST

భార్యతో గొడవపడి ఓ మందుబాబు విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, స్థానికులు విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సకాలంలో సరఫరా ను నిలిపివేశారు.

భార్యతో గొడవపడి   విద్యుత్‌ స్తంభమెక్కిన మందుబాబు
విద్యుత్‌ స్తంభంపై ఉన్న శివ

ఇచ్ఛాపురం, నవంబరు 16: భార్యతో గొడవపడి ఓ మందుబాబు విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, స్థానికులు విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సకాలంలో సరఫరా ను నిలిపివేశారు. దీంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన ఇచ్ఛాపురం పురపాలక సంఘం పరిధి బెల్లుపడ కంసాలవీధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లుపడకు చెందిన ముత్యాల శివకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివ పెయింటర్‌గా పని చేస్తుంటాడు. ప్రతిరోజూ మద్యంతాగే అలవాటు ఉంది. బుధవారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి భార్యతో గొడపడ్డాడు. ఆ త రువాత ఆత్మహత్య చేసుకుంటానంటూ రాత్రి 7.15 గంటల సమయంలో వీధి లోని విద్యుత్‌ స్తంభం ఎక్కేశాడు. తీగలను పట్టుకునేందుకు యత్నించడం.. మళ్లీ వెనక్కు తగ్గడం చేసేవాడు. అప్రమత్తమైన స్థానికులు విద్యుత్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సరఫరా నిలిపి వేసి తాగుబోతు శివను కిందకు దించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2022-11-17T00:02:56+05:30 IST

Read more