మండల బడ్జెట్‌ ఆమోదం

ABN , First Publish Date - 2022-12-31T00:16:11+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ బడ్జెట్‌ను ఎంపీడీవో ఎస్‌.శ్రీనివాసులు చదివి వినిపించారు.

మండల బడ్జెట్‌ ఆమోదం

జి.సిగడాం:స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ బడ్జెట్‌ను ఎంపీడీవో ఎస్‌.శ్రీనివాసులు చదివి వినిపించారు. ‘2022-23 సంవత్సరానికి సవరణ బడ్జెట్‌ నిల్వ రూ.11,29,300. ప్రారంభ నిల్వతో మొత్తం రాబడి రూ.58,13,68,550. మొత్తం ఖర్చు రూ.57,97,11,400. సంవత్సరానికి రూ.16,57,150 మిగులు నిధులను అంతిమ నిల్వగా అంచనావేస్తూ బడ్జెట్‌లో పొందుపరిచినట్లు’ ఎంపీడీవో తెలిపారు. అదేవిధంగా 2023-24 సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ గత ఏడాది సవరణ బడ్జెట్‌ ముగింపు నిల్వ రూ.16,57,150 పరిగణలోకి తీసుకుంటూ రూ.68,08,87,350 రాబడిగా, రూ 67,89,91,500 ఖర్చుగా, రూ.18,95,850 మిగులు బడ్జెట్‌గా అంచనా వేసినట్లు చెప్పా రు. మండల ప్రత్యేకాహ్వానితుడు మీసాల వెంకటరమణ, వైస్‌ ఎంపీపీలు మీసాల సాధ్వీమణి, తోలేటి వెంకటరావు, బగాది రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:16:13+05:30 IST