వేతనాల కోసం అంగన్‌వాడీల నిరసన

ABN , First Publish Date - 2022-05-14T05:30:00+05:30 IST

రెండునెలలుగా వేతనాలు అంద డం లేదని అంగన్‌వాడీలు శనివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.

వేతనాల కోసం అంగన్‌వాడీల నిరసన
ఆర్‌ఐకి వినతిపత్రం అందజేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు:


సోంపేట: రెండునెలలుగా వేతనాలు అంద డం లేదని అంగన్‌వాడీలు శనివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌ఐ కిరణ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు, బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు తీసుకొచ్చి కేంద్రాలు నిర్వహిస్తున్నా మని వాపోయారు. సీఐటీయూ నాయకులు ఎస్‌.లక్ష్మీనారాయణ, అంగన్‌వాడీ ప్రతినిధులు వి.హేమలత, ఎన్‌.భువనేశ్వరి, ధనలక్ష్మి, భగవతి, జయంతి పాల్గొన్నారు. 



 


Updated Date - 2022-05-14T05:30:00+05:30 IST