అరాచక పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2022-12-31T00:22:40+05:30 IST

రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.

అరాచక పాలనకు చరమగీతం పాడాలి
జలుమూరులో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కార్యకర్తలు

- ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి’లో టీడీపీ నాయకులు

రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

- ఆంధ్రజ్యోతి బృందం

Updated Date - 2022-12-31T00:22:40+05:30 IST

Read more