రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2022-12-31T23:44:04+05:30 IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. శనివారం లావేరులో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ర్యాలీ చేపట్టి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.

రాష్ట్రంలో అరాచక పాలన

లావేరు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. శనివారం లావేరులో బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో ర్యాలీ చేపట్టి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఐ.తోటయ్యదొర, నాయకులు లంకలపల్లి శ్రీనివాసరావు, పిన్నింటి మధుబాబు, లంక నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం: టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలకు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కిమిడి కళావెంకటరావు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం రాజాంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-12-31T23:44:04+05:30 IST

Read more