చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ABN , First Publish Date - 2022-12-16T23:19:59+05:30 IST
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంపీపీ ఉంగ ప్రవీణ అన్నారు. బ్రాహ్మణతర్లా జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం 66వ జిల్లా ఒకటవ జోన్ అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు ముగిశాయి.
పలాసరూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంపీపీ ఉంగ ప్రవీణ అన్నారు. బ్రాహ్మణతర్లా జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం 66వ జిల్లా ఒకటవ జోన్ అంతర్ పాఠశాలల క్రీడా పోటీలు ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. బాలికల విభాగంలో ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌ను జ్యోతిరావు పూలే పాఠశాల (పలాస), బాలుర విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల(పలాస) కైవసం చేసుకు న్నాయి. కార్యక్ర మంలో హెచ్‌ఎం కె.వైకుంఠరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పైల వెంకటరమణ, క్రీడాకారులు, వ్యాయా మోపాధ్యాయులు పాల్గొన్నారు.