‘ఇంటర్న్‌షిప్’నకు కేటాయించాలి
ABN , First Publish Date - 2022-12-07T23:03:11+05:30 IST
డిగ్రీ విద్యార్థులను తక్షణమే ఇంటర్న్‌షిప్‌నకు కేటాయించాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావుతో కలిసి కలెక్టర్ సమీక్షించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
అరసవల్లి, డిసెంబరు 7: డిగ్రీ విద్యార్థులను తక్షణమే ఇంటర్న్‌షిప్‌నకు కేటాయించాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావుతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఈపీ-2020 విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్ విదానాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఏ మండలాల్లో ఉన్న విద్యార్థులను ఆ మండలా ల్లోనే ఇంటర్న్‌షిప్‌కు కేటాయించాలన్నారు. విద్యార్థులు మొదట 2 నెలలు కమ్యూనిటీ సర్వీసు, మరో రెండు నెలలు ఇంటర్న్‌షిప్, ఆరు నెలలు ఇంటర్న్ షిప్ ఫేజ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు నిర్వహించామని, విద్యార్థుల కేటాయింపు తక్షణమే జరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి జి.హారిక, డీఆర్వో ఎం.రాజేశ్వరి, అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ రాజేంద్రప్రసాద్, డీపీవో రవికుమార్, జడ్పీ సీఈవో వెంకటరామన్, డీఎస్‌వో వెంకటరమణ, డీఎంహెచ్‌వో బి.మీనాక్షి, తదితరులు పాల్గొన్నారు.