ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-03T06:05:56+05:30 IST

ప్రతీ ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అని ఆర్డీవో టి.సీతారామమూర్తి అన్నారు. కొత్త ఓటరు నమోదు ప్రక్రియపై మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి
మాట్లాడుతున్న ఆర్డీవో సీతారామమూర్తి


 17 ఏళ్లు దాటిన యువత దరఖాస్తు చేసుకోవాలి

 ఆర్డీవో సీతారామమూర్తి 

ఇచ్ఛాపురం: ప్రతీ ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అని ఆర్డీవో టి.సీతారామమూర్తి అన్నారు. కొత్త ఓటరు నమోదు ప్రక్రియపై మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సీతారామమూర్తి మాట్లాడుతూ.. ఈ నెల 4 నుంచి అక్టోబరు 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వచ్చి ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేస్తారని తెలిపారు.  ఈ కార్యక్రమానికి గ్రామ వలంటీర్లను దూరం పెట్టాలన్నారు. వారు ఇందులో కలుగజేసు కోకుండా చూడాలన్నారు. ప్రతీ ఓటరుకి కొత్త ఎలకా్ట్రనిక్‌ కార్డులు అందజేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో గానీ, తహసీల్దార్‌ కార్యాలయంలో గానీ కొత్త ఓటరు నమోదుకు దరఖా స్తు చేసుకోవచ్చునని చెప్పారు. ఓటరు కార్డుల్లో తప్పులు దొర్లితే సరిచేసుకోవచ్చునన్నారు. గతంలో ప్రతిఏటా జనవరిలోనే కొత్త ఓటరు నమోదు కార్యక్రమం జరిగేదని, 2023 నుంచి జనవరి1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబరు 1 తేదీల్లో కొత్త ఓటు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. 17 సంవత్సరాలు దాటిన యువతీ, యువకులు దరఖాస్తు చేసుకుంటే వారికి 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరు కార్డు వస్తుందన్నారు. హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఓటరు కార్డులో తప్పులు దొర్లినట్లయితే ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకొని సరి చేసుకోవచ్చునని తెలిపారు. కొత్త ఓటర్‌ రిజిస్టేషన్‌ కోసం ఫారం-6ను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.లావణ్య, ఎలక్షన్‌ డీటీ గురుప్రసాద్‌,  డీటీ శ్రీహరి, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-03T06:05:56+05:30 IST