యువకుడిపై మద్యం సీసాతో దాడి

ABN , First Publish Date - 2022-10-07T05:46:09+05:30 IST

యువకుడిపై మద్యం సీసాతో దాడి

యువకుడిపై మద్యం సీసాతో దాడి
చికిత్స పొందుతున్న ప్రదీప్‌

కొత్తూరు: మండల కేంద్రంలో ఓ యువకుడిపై మద్యం సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పొలీసులు తెలిపిన వివ రాల మేరకు.. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన టొంపల ప్రదీప్‌ వలంటీరుగా, ఓ డెంటల్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తు న్నాడు. ప్రదీప్‌ బుదవారం పొలాల వైపు వెళ్ల గా అక్కడ సొంట్యాన దాసు (నవీన్‌), టొంప ల వినయ్‌ ఉన్నారు. ప్రదీప్‌ను ఉద్దేశిస్తూ నవీన్‌ కామెంట్‌ చేశాడు. దీనికి ప్రదీప్‌ సమాధానం ఇచ్చాడు. దీంతో పక్కనే ఉన్న టొంపల వినయ్‌ మద్యం సీసా పగలుగొట్టి తల, మెడ, భుజాలు, చెవిపై విచక్షణ రహి తంగా పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయ పడిన ప్రదీప్‌ ప్రాణ భయంతో గ్రామంలోకి పరుగు తీశాడు. జరిగిన విషయం తల్లిదండ్రులు చెప్పాడు. తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను స్థానిక సీహెచ్‌సీకి తల్లిదండ్రులు తరలించగా, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.  ప్రదీప్‌ ఫిర్యాదు మేరకు కొత్తూరు పొలీసులు కేసు నమెదు చేశారు.

Updated Date - 2022-10-07T05:46:09+05:30 IST