రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-10-07T05:47:52+05:30 IST
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
టెక్కలి రూరల్: దసరా పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చేతికంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లితండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. జగన్నాథపురం, పాత్రపురం గ్రామాల మధ్యలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలసింగి గ్రా మానికి చెందిన పిన్నింటి గంగాధర్(25) మృతిచెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. ముఖలింగాపురం పంచాయతీ పాలసింగి గ్రామా నికి చెందిన గంగాధర్ విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 2న స్వగ్రామానికి వచ్చాడు. దసరా రోజు బుధవారం తన సమీప బంఽధువు కిరణ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై పాలసింగి నుంచి వస్తుం డగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గంగాధర్ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిరణ్ గాయాలతో బయటపడ్డాడు. గంగాధర్‌కు తల్తిదండ్రులతోపాటు సోదరుడు ఉన్నారు. ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు.