కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు

ABN , First Publish Date - 2022-08-31T05:34:39+05:30 IST

మండలంలోని చింతలపోలూరు సమీపంలో మంగళ వారం ఉదయం ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లింది.

కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు:


  తప్పిన పెను ప్రమాదం

మెళియాపుట్టి: మండలంలోని చింతలపోలూరు సమీపంలో మంగళ వారం ఉదయం ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లింది. అయితే, ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్నారు. పర్లాఖిమిడి నుంచి టెక్కలి వైపు వస్తుండగా పోలూరు సమీపంలో అడ్డంగా వచ్చిన ఓ వ్యక్తిని తప్పించబోయి బస్సు కాలువలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో బస్సులో సుమారు 30మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో వారంతా ఉలికిపడ్డా రు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  


Read more