రాయి మీదపడి గ్రానైట్‌ కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2022-11-17T23:23:01+05:30 IST

దీనబంధుపురం గ్రామ సమీపంలోని ఒక గ్రానైట్‌ పరిశ్రమలో పనులు చేస్తుండగా ప్రమాదవశా త్తు రాయి తలపై పడి ఒడిశా రాష్ట్రం బసంతపుర్‌ గ్రామానికి చెందిన గోపాల్‌ (25) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌ గత కొంతకాలంగా ఓ గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తు న్నాడు.

రాయి మీదపడి గ్రానైట్‌ కార్మికుడి మృతి
గోపాల్‌ (ఫైల్‌)

మెళియాపుట్టి: దీనబంధుపురం గ్రామ సమీపంలోని ఒక గ్రానైట్‌ పరిశ్రమలో పనులు చేస్తుండగా ప్రమాదవశా త్తు రాయి తలపై పడి ఒడిశా రాష్ట్రం బసంతపుర్‌ గ్రామానికి చెందిన గోపాల్‌ (25) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోపాల్‌ గత కొంతకాలంగా ఓ గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తు న్నాడు. గురువారం వేకువజామున గ్రానైట్‌ రాయిని జాకి పైకి ఎక్కిస్తుండగా తలపై పడడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే అత నిని టెక్కలి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-11-17T23:23:03+05:30 IST