మాల్దీవుల్లో చిక్కుకున్న 32 మంది
ABN , First Publish Date - 2022-12-31T23:51:35+05:30 IST
శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలు, ఒడిసాకు చెందిన 32 మంది మాల్దీవుల్లో చిక్కుకుని పో యారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు. పను ల్లేక, చేతిలో డబ్బుల్లేక ఆకలితో అలమటిస్తున్నామని వా పోతున్నారు. మొబైల్ ద్వారా ఇక్కడి తమ బంధువులకు ఈ సమాచారం ఇచ్చారు.
ఇచ్ఛాపురం: శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలు, ఒడిసాకు చెందిన 32 మంది మాల్దీవుల్లో చిక్కుకుని పో యారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు. పను ల్లేక, చేతిలో డబ్బుల్లేక ఆకలితో అలమటిస్తున్నామని వా పోతున్నారు. మొబైల్ ద్వారా ఇక్కడి తమ బంధువులకు ఈ సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం పూర్ణామార్కెట్ ప్రాంతం పండావీధిలో ఉన్న భావన ఇన్‌స్టిట్యూట్ ద్వారా వీరంతా మాల్దీవులకు గత ఏడాది ఏప్రిల్‌లో వెళ్లారు. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన శంకర్, సుభాష్‌రౌలో, పూండికి చెందిన శివ తదితరులు వీరికి సహకరించారు. ఒకొక్కరి నుంచి దళారులు రూ.లక్ష చొప్పున తీసుకున్నా రు. అక్కడ జావ్సా ఇన్‌స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో వీరు పనులకు చేరారు. వీరం తా అక్టోబరు వరకు పనిచే శారు. కంపెనీ వారు మూడు నెలల జీతం మాత్రమే ఇచ్చా రు. మిగిలిన జీతం అడిగితే ఇక్కడ పనిలేదు.. వెళ్లిపోమ న్నారు. దీంతో బాధితులు గడిచిన రెండు నెలలుగా గదికే పరిమితం అయ్యారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. పాస్‌పోర్టులు కూడా వీరి వద్ద లేవు. ఏజెంట్లు, దళారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని వారంటున్నారు. మాల్దీ వుల్లో చిక్కుకున్న వారిలో 25మంది శ్రీకాకుళం జిల్లా వాసులు కాగా.. ఇద్దరు పశ్చిమగోదావరి, ఐదుగురు ఒడిసా వారు ఉన్నారు. జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్ర తినిధులు తమను రక్షిం చాలని వేడుకుంటున్నారు.