టాలెంట్ టెస్ట్‌లో 18 వేల మంది విద్యార్థులు
ABN , First Publish Date - 2022-12-15T23:39:35+05:30 IST
ఏపీ ప్రైవేట్ పాఠశాలల యూనియన్ (ఆప్సా) ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్‌లో నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో సుమారు 18వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్టు ఆ యూని యన్ ప్రధాన కార్యదర్శి మెట్ట జనార్ధనరావు తెలిపారు.
పోలాకి: ఏపీ ప్రైవేట్ పాఠశాలల యూనియన్ (ఆప్సా) ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్‌లో నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో సుమారు 18వేల మంది విద్యార్థులు పాల్గొన్నట్టు ఆ యూని యన్ ప్రధాన కార్యదర్శి మెట్ట జనార్ధనరావు తెలిపారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో 110 పాఠశాలలల్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రస్థాయిలో పోటీల్లో ప్రతిభ చూపి మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారికి బహుమతులు అందిస్తామని యూనియన్ జిల్లా కౌన్సిలర్ తమ్మినేని సింహాచలం, అధ్యక్షుడు గట్టి పాపారావు, కన్వీనర్ ఇలపండ గణపతిరావు, గౌరవసభ్యులు శ్రీరాములు తదితరులు తెలిపారు.