వైసీపీకి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు : కందుల

ABN , First Publish Date - 2022-08-17T06:17:24+05:30 IST

పట్టణంలో సాగరు నీరు రాక 16 రోజులైన సంబంధిత అధికారులు నిద్రావస్థలో ఉన్నారని కందుల నారాయణరెడ్డి ధ్వజమెత్తారు.

వైసీపీకి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు : కందుల
ధర్నా చేస్తున్న మహిళలు

పొదిలి రూరల్‌ ఆగస్టు 16 : పట్టణంలో సాగరు నీరు రాక 16 రోజులైన సంబంధిత అధికారులు నిద్రావస్థలో ఉన్నారని కందుల నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో మహిళలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు ఉన్నారా..? లేరా..? అని ఆయన ప్రశ్నించారు. 16 రోజులుగా తాగునీరు రాక ఇబ్బందులు పడుతుంటే ప్రజలు ఏం చేస్తు న్నారని ప్రశ్నించారు. అధికారులు కాంట్రాక్టర్‌ చేతిలో కీలుబొమ్మల్లా మారి తాగునీరు అందించే విషయంలో కూడా వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాల యం వీధి 14వ వార్డులో ట్యాంకర్ల  లేవని, సాగర్‌ నీరు లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పట్టణంలో 20 వార్డులకు మొత్తం 234 ట్రిప్పులు రోజువారి తోలకం జరుగుతున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కాని మొత్తం మీద 50 నుండి 100 ట్యాంకర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. 14 వార్డులో కాంట్రాక్టర్‌ ఎవరో తెలి యకుండా రోజుకు 20 ట్రిప్పులు వాటర్‌ తోలుతున్నట్లు నమోదు చేస్తున్నారని కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు  కమిషనర్‌ డానియేల్‌ను ప్రశ్నిం చారు. ప్రజలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు మీగ డ ఓబులరెడ్డి, ముల్లా ఖుద్దూస్‌, నాయకులు పెదబాబు, చినబాబు,  షబ్బీర్‌, ఎస్‌ఎం భాష, కాటూరి శ్రీను, ఖల్‌నాయక్‌, ఠాగూర్‌, మౌళాలి, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నరేష్‌, మహిళా నాయకురాలు షహానాధ్‌ ఎస్కేఎం ఖశీం, యాసిన్‌, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.

పొదిలి రూరల్‌ : తమ కాలనీని డంపింగ్‌ యార్డుగా మార్చోద్దని 14వ వార్డులో నివాసం ఉంటున్న నిర్వాసితులు కందుల నారాయణరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.  గతంలో పట్టణంలో చెత్తను నిల్వచేసే వారన్నారు. ఇప్పుడు తమ కాలనీలో చెత్తను నిల్వ చేస్తున్నారని వాపోయారు. మున్సిపాలిటికీ ప్రస్తుత కమిషనర్‌ వచ్చిన తరువాత కాలనీలో చెత్తను నిల్వ చేస్తున్నారన్నారు. అలా చేయడం వలన దుర్గందం వెదజల్లుతోందని, రోగాలు వస్తాయన్నారు. 

Updated Date - 2022-08-17T06:17:24+05:30 IST