టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రకాశం జిల్లాలోకి అద్దంకిని మారుస్తాం
ABN , First Publish Date - 2022-12-07T23:55:38+05:30 IST
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అద్దంకి నియోజకవర్గాన్ని పూర్వపు ప్రకాశం జిల్లాలోనే కొనసా గించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలి పారు. బుధవారం మండలంలోని కొప్పెరపాడు వచ్చిన ఎమ్మెల్యే రవి కుమార్కు గ్రామస్థులు తమ ఇబ్బందులను ఏకరువుపెట్టారు.
ఎమ్మెల్యే రవికుమార్
బాపట్లకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామంటూ కొప్పెరపాడు వాసుల ఆవేదన
బల్లికురవ, డిసెంబరు 7: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అద్దంకి నియోజకవర్గాన్ని పూర్వపు ప్రకాశం జిల్లాలోనే కొనసా గించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలి పారు. బుధవారం మండలంలోని కొప్పెరపాడు వచ్చిన ఎమ్మెల్యే రవి కుమార్కు గ్రామస్థులు తమ ఇబ్బందులను ఏకరువుపెట్టారు. నూత న జిల్లా బాపట్లకు వెళ్లడానికి కనీసం బస్సు సౌకర్యం కూడా ఏర్పా టుచేయలేదన్నారు. అక్కడికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదన్నారు.
దీనిపై స్పందించి ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ ప్రజల ఇ బ్బందులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లా నని చెప్పారు. అధికారంలోకి రాగానే మరలా జిల్లాల పునర్విభజన చే స్తానని హమీ ఇచ్చారని చెప్పారు. అద్దంకి, కందుకూరు నియెజకవర్గా లను ప్రకాశం జిల్లాలో కొనసాగించి మార్కాపురంను జిల్లా కేంద్రం చేసేలా టీడీపీ అలోచనలో ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలను పరి గణలోకి తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుచేసిందని చె ప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమ సమస్యలను జిల్లా అధికులకు చెప్పుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నా రు. ఈ విషయాన్ని గతంలోనే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకె ళ్లినట్టు చెప్పారు.
కొప్పెరపాడులోని ఉన్నత పాఠశాలలో సుమారు ఏడు వందల మం ది విద్యార్థులు ఉన్నారని, అక్కడ సరైన వసతులు లేవని తల్లిదండ్రు లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 3,4,5 తరగతులను విలీనం చేసి వారికి వసుతుల కల్పించలేదని అన్నారు. వసతులు కల్పించకుండా వి లీనం చేయటం ఏమిటని అడిగితే మండల విద్యాశాఖాధికారి తమ ను పట్టించుకోలేదని వారు వాపోయారు. విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలను నాడు నేడు ద్వారా నిధులు మంజురు చేయించి నిధు లు కాజేసే ఎత్తుగడ చేస్తున్నారని తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్కు తల్లిదండ్రుల విన్నపాన్ని తీసుకెళ్లి విద్యార్థు లకు న్యాయం చేసేలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు.
నివాళులర్పించిన రవికుమార్
అద్దంకి, నవంబరు7: పట్టణంలోని 19వ వార్డులో టీడీపీ నాయకు డు షేక్ సైదా భార్య సుమియా అనారోగ్యంతో మృతిచెందారు. బుధవా రం ఎమ్మెల్యే రవికుమార్ ఆమె మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సా నుభూతి తెలిపారు. స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.
నేటి పర్యటన వివరాలు
అద్దంకి, డిసెంబరు 7: ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గురువారం పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు జార్లపాలెం, 10 గంటలకు పి.గుడిపాడు, రాత్రి 8 గంటలకు చిలకలూ రిపేట, 9 గంటలకు నార్నెవారిపాలెం, 9.45 గంటలకు బొమ్మనంపాడు లలో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నారు.