బీసీలకు 56 కార్పొరేషన్లతో ఒరిగిందేమిటో చెప్పాలి
ABN , First Publish Date - 2022-12-07T00:02:20+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తీరని అ న్యాయం జరుగుతోందని, 56 కార్పొరేషన్లు ఏర్పా టు చేయడం ద్వారా వారికి ఒరిగింది ఏమీ లే దని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయం వద్ద నుంచి ఎన్టీఆర్ విగ్రహం వర కు వారు బిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
వైసీపీ పాలనపై టీడీపీ బీసీసెల్ ధ్వజం
ఒంగోలులో భిక్షాటన
ఒంగోలు(కార్పొరేషన్), డిసెంబరు 6 : వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తీరని అ న్యాయం జరుగుతోందని, 56 కార్పొరేషన్లు ఏర్పా టు చేయడం ద్వారా వారికి ఒరిగింది ఏమీ లే దని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు ధ్వజమెత్తారు. బుధవారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయం వద్ద నుంచి ఎన్టీఆర్ విగ్రహం వర కు వారు బిక్షాటన చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ జగన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకు56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మొ ండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హాయంలో కార్పొరేషన్ రుణాలతో పాటు, ఆదరణ పథకం కింద వృత్తి పరికరాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర సంక్షేమ పథకాలను అందజేసినట్లు గుర్తు చేశారు. బీసీల ఓట్లతో అధి కారంలోకి వచ్చిన వైసీపీ వారి సంక్షేమం కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని ఆరోపించా రు. అంతేగాకుండా గతంలో ఉన్న పథకాలను పూర్తిగా రద్దు చేయడం ద్వారా అన్నీ వర్గాల బీసీ లు అభివృద్ధికి దూరం అయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా నగరంలో భిక్షాటన చే యగా సుమారు రూ.10వేల వరకు నగదు రావ డంతో వాటిని కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరా వు, నాయకులు ఆవుల శ్రీనివాసరావు, టి.అనం తమ్మ, పిలుట్ల సుధాకర్, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ లక్ష్మి, జూటూరి కృష్ణ, ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు కామేపల్లి శ్రీ నివాసరావు, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.