బ్రాహ్మణ కార్పొరేషన్‌ను కాపాడుకుంటాం

ABN , First Publish Date - 2022-09-20T05:07:27+05:30 IST

రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను కాపాడుకోవటం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ఇందుకోసం భవిష్యత్‌లో మరింతగా పోరాటం చేస్తామని జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులు అన్నారు. టీడీపీ పిలుపు మేరకు సోమవారం వారు విజయవాడ గొల్లపూడిలోని ఏపీబ్రాహ్మణ కార్పొరేషన్‌ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను కాపాడుకుంటాం
జిల్లా బ్రాహ్మణ నాయకులను పరామర్శిస్తున్న మైలవరం తెదేపా నాయకులు

విజయవాడలో జిల్లా నాయకుల అరెస్ట్‌

 పరామర్శించిన మైలవరం టీడీపీ నాయకులు

ఒంగోలు(కల్చరల్‌), సెప్టెంబరు 19: రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను కాపాడుకోవటం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, ఇందుకోసం భవిష్యత్‌లో మరింతగా పోరాటం చేస్తామని జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులు అన్నారు. టీడీపీ పిలుపు మేరకు సోమవారం వారు విజయవాడ గొల్లపూడిలోని ఏపీబ్రాహ్మణ కార్పొరేషన్‌ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ నాయకులు కాశీభట్ట సాయినాఽథ్‌ శర్మ, కామరాజుగడ్డ కుసుమకుమారి, గందూరి మహేష్‌, కె.శివశర్మ, రాణి శ్రీనివాస్‌, సాయి స్వామి తదితరులను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేసిన ఏపీబ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేయటానికి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ కుట్ర చేస్తున్నారని, ఇందుకు శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన తమను అరెస్ట్‌ చేయటం దారుణమని అన్నారు. వారిని మైలవరం నియోజకవర్గానికి చెందిన కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో పరామర్శించారు.  


Read more