సముద్ర వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది!

ABN , First Publish Date - 2022-08-14T05:21:57+05:30 IST

సముద్ర వాతా వరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనం దరిపై ఉందని బాపట్ల జిల్లా మత్స్యశాఖ ఏడీ కృష్ణకిషోర్‌ అన్నారు.

సముద్ర వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది!
బోట్లకు జాతీయజెండాలు, కలర్‌ ఎల్‌ఈడీలైట్లు ఏర్పాటుచేసిన పల్లెపాలెం మత్స్యకారులు

మత్స్యశాఖ ఏడీ కృష్ణకిషోర్‌ 

చినగంజాం, ఆగస్టు 13: సముద్ర వాతా వరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనం దరిపై ఉందని బాపట్ల జిల్లా మత్స్యశాఖ ఏడీ కృష్ణకిషోర్‌ అన్నారు. ఆజాదీకా అమృ త్‌ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మత్స్యశాఖ, రిలయన్స్‌ ఫౌండేషన్‌ సంయు క్త ఆధ్వర్యంలో పల్లెపాలెం గ్రామ పంచాయ తీ పరిధిలోని మత్స్యకారులు కుందేరు కాలువ వద్ద తమ బోట్లకు జాతీయజెండాలు, ఎల్‌ఈడీ లైట్లను శనివారం రాత్రి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సైకం మణి అద్యక్షతన జరిగిన సమా వేశంలో కృష్ణకిషోర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా మత్స్యకారులంతా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. మత్స్యకారులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని అన్నారు. 

కార్యక్రమంలో మత్స్యశాఖ ఎఫ్‌డీవో రాజ్‌కుమార్‌, పల్లెపాలెం విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పుల్లారావు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ కమతం యాకోబు  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:21:57+05:30 IST