ఏబీసీకి నీటి విడుదల.. నిలిపివేత
ABN , First Publish Date - 2022-06-26T05:32:50+05:30 IST
అద్దంకి బ్రాంచి కెనాల్(ఏబీసీ)కు నీటి విడుదల చేయటం... ఆ వెంటనే నిలిపి వేయటం జరిగింది.

పల్నాడు జిల్లా పరిధిలో కుంగిన కాలువ కట్ట
అద్దంకి, జూన్ 25: అద్దంకి బ్రాంచి కెనాల్(ఏబీసీ)కు నీటి విడుదల చేయటం... ఆ వెంటనే నిలిపి వేయటం జరిగింది. పల్నాడు జిల్లా పరిదిలో శావల్యాపురం మండలం గంటావారిపాలెం, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం మధ్య ఏబీసీ 16వ మైలు వద్ద కుంగటంతో ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే నీటి సరఫరా నిలి పివేశారు. చెరువులకు నీరు నింపేందుకు సాగర్ నీరు విడుదలచేసిన క్రమంలో ఏబీసీకి నీటివిడుదల చేయగా.. శుక్రవారం ఉదయం బాపట్ల జిల్లా సరిహద్దు 18 వ మైలు వద్దకు చేరాయి. సాయంతానికి కోనంకి సబ్‌డివిజన్ వరకు సాగర్ నీరు చేరాయి. అయితే , గంటావారిపాలెం, అడవిపాలెం మధ్య 16వ మైలు వద్ద ఏబీసీ కాలువ కట్ట కుంగిపో యింది. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్ఎస్పీ అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపి వేశా రు. దీంతో శనివారం ఉదయానికి ఏబీసీలో నీటి సరపరా పూర్తి గా నిలిచిపోయింది.
బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి, పర్చూరు ని యోజకవర్గాలలోని 124 నోటిఫైడ్, నాన్ నోటి ఫైడ్ చె రువులు, భవనాసి చెరువుకు సాగర్ నీరు నింపేం దుకు నీటిని విడుదల చేశారు. అయితే విడుదల చేయటం, నిలిపి వేయటం ఒక్క రోజులోనే జరగటంతో సాగర్ కాలువల నుంచి నీరు చెరువులకు చేరకుండానే నిలిచిపోయింది. మే నెల చివర్లో కూడా ఏబీసీకి నీటి విడుదల జరిగినా ఒక్క రోజు మాత్రమే వచ్చి నిలిచిపోయింది. ఏబీసీలో నీరు నిలిపి వేయటంతో ఆ నీటిని గుంటూరు బ్రాంచ్ కెనాల్ కు విడుదల చేశారు. గుంటూరు బ్రాంచి కెనాల్ పరిధిలో చెరువులు నింపిన తరువాత అద్దంకి బ్రాంచి కెనాల్ కాలువ కట్ట పటిష్టం చేసి వెంటనే నీటి విడుదల చేస్తారా అన్న విషయం ఉన్నతాధికారులు నిర్ణయించాల్సి ఉంది. నీటి విడు దల ఆలస్యమైతే ఏబీసీ పరిదిలో చెరువులకు నీరు పూర్తి స్థాయిలో చేరకుండానే నిలిచిపోతాయేమో నన్న ఆందోళన ప్రజలలో నెల కొంది.
కాలువకట్ట పనులు వేగవం తంగా పూర్తిచేసి ఏబీసీకి నీటి వి డుదల చేసేవిధంగా ఉన్నతాధికా రులు చర్యలు చేపట్టాలని అద్దం కి, పర్చూరు నియోజకవర్గాల ప రిధిలో ప్రజలు కోరుతున్నారు.