వ్యవసాయ పథకాలు రైతులకు అందేలా వలంటీర్లు పనిచేయాలి
ABN , First Publish Date - 2022-10-08T04:22:43+05:30 IST
వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వ పఽథకాలు సత్వరమే అందేలా వలంటీర్లు పనిచేయాలని మండల వ్యవసాయశాఖ ఏవో కుమారి కోరారు. శుక్రవారం మండలంలోని అన్ని సచివాలయాలలో పనిచేస్తున్న వలంటీర్లలో ఒకరిని రైతు భరోసా కేంద్రం ద్వారా పనిచేసేందుకు శిక్షణ ఇచ్చారు.
బల్లికురవ, అక్టోబరు 7 : వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వ పఽథకాలు సత్వరమే అందేలా వలంటీర్లు పనిచేయాలని మండల వ్యవసాయశాఖ ఏవో కుమారి కోరారు. శుక్రవారం మండలంలోని అన్ని సచివాలయాలలో పనిచేస్తున్న వలంటీర్లలో ఒకరిని రైతు భరోసా కేంద్రం ద్వారా పనిచేసేందుకు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఏవో మాట్లాడుతు వ్యవసాయ సిబ్బందితో కలిసి అనుసంధానంగా వలంటీర్లు పనిచేయాలన్నారు. రైతులు ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ వంటి వాటిల్లో నమోదు అయ్యేలా చేయాలన్నారు.
తక్షణమే ఈ కేవైసీ చేయించుకోవాలి
మండలంలోని పలు గ్రామాలలో ఖరీఫ్ కింద 4,805 మంది రైతులు పంట నమోదు చేయించుకున్నారని, తక్షణమే వారందరు ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకొని రైతులకు ప్రభుత్వం ఈనెల 10 వ తేదీ వరకు గడువు ఇచ్చిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఏవో కోరారు.
మార్టూరులో..
మార్టూరు : ప్రభుత్వ పఽథకాలను లబ్ధిదారులకు సకాలంలో అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని ఏడీఏ సుదర్శన్‌రాజు అన్నారు. మండలంలో ఎంపిక చేసిన వలంటీర్లకు శిక్షణా కార్యక్రమం శుక్రవారం స్థానిక రైతు భరోసా కేంద్రంలో జరిగింది. ఒక్కో రైతు భరోసా కేంద్రానికి ఒక్కో వలంటీర్‌ను కేటాయించారు. పంట నమోదును వేగవంతం చేయాలన్నారు.