నేటియువతకు వివేకానంద మార్గదర్శి
ABN , First Publish Date - 2022-01-13T05:33:52+05:30 IST
వివేకానందుడు నేటి యువతకు ఎంతో మార్గదర్శకమని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు.
కనిగిరి, జనవరి 12: వివేకానందుడు నేటి యువతకు ఎంతో మార్గదర్శకమని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. కొత్తూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం వివేకానంద జయంతి ఉత్సవాన్ని బుధవారం నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాశీంసాహెబ్, బ్రహ్మారెడ్డి, చెంచిరెడ్డి, గోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, యర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, పండు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కేటీసీ స్టడీ సర్కిల్‌లో ఉపాధ్యాయులు పాపారాయుడు వివేకానందస్వామి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కేటీసీ స్టడీ సర్కిల్ ఉపాధ్యాయులు రవికుమార్, కెరోలిన్‌లు పాల్గొన్నారు. అదేవిధంగా జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి వివకానుందుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కనిగిరి : స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సమాజంపట్ల సేవాభావంతో మెలగాలని మాజీ జడ్పీటీసీ వైఎం ప్రసాద్‌రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని పొదిలిరోడ్డులో ఉన్న రామకృష్ణ మందిరంలోని వివేకానంద విగ్రహానికి బుధవారం పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీనివాసులరెడ్డి, యర్రారెడ్డి, రిటైర్డ్ ఎంఈవో చలపతిరావు, ముత్యాల సుధాకర్‌రెడ్డి, దాదిరెడ్డి మాలకొండారెడ్డి, పులి రమేష్, రాజేంద్ర, ఆచారి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పామూరులో : స్వామి వివేకానంద 159వ జయంతి 38వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మండల తెలుగు యువత ఆధ్వర్యంలో స్థానిక కేజీబీవీ ప్రాంగణంలో పిచ్చిమొక్కలను బుధవారం శ్రమదానం ద్వారా తొలగించారు. వివేకానందుని స్పూర్తితో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు టీవీకే సుబ్బారావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు ఉప్పలపాటి హరిబాబు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ ఖాజారహంతుల్లా, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎన్ సాంబయ్య, ఆర్‌ఆర్ రఫీ, షేక్ మస్తాన్, గుత్తి మహేష్, మెంటా నరసింహారావు, పులి నాయబ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో వివేకానందస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కె రామిరెడ్డి, గట్లా విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు : స్వామి వివేకానంద జయంతి 159వ జయంతి కార్యక్రమాన్ని పట్టణ బీజేపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విశిష్ఠతను విశ్వవేదికపై తెలియజేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జొన్నాదుల రాఘవయ్య, పి.రమేష్ యాదవ్, మువ్వల భూషయ్య, గట్టమనేని హరిబాబు, మన్నేపల్లి వరప్రసాదరావు, పాణెం గాంధీ, చిన్ని పాండురంగయ్య, తానికొండ కోటయ్య, కవర్తపు మల్లిఖార్జునరావు, పాలూరి మాలకొండారెడ్డి, రాజేశ్వరరావు, రమేష్, మాలకొండయ్య, శ్రీదేవి, రోహి ణి పాల్గొన్నారు.
కందుకూరు :తెలుగుయువత ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా బుధవారం శ్రమదానం నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వీధులు శుభ్రం చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెజవాడ ప్రసాదు, టీడీపీ నేతలుదామా మల్లేశ్వరరావు, పొడపాటి మహేష్, చిలకపాటి మధు, నార్నె రోశయ్య తదితరులు పాల్గొన్నారు.