వెంకట సుబ్బమ్మ మృతి తీరనిలోటు

ABN , First Publish Date - 2022-12-31T22:20:33+05:30 IST

మండలంలోని శంకరాపురం మాజీ స ర్పంచ్‌ మందలపు వెంకట సుబ్బమ్మ మృతి వ్యక్తిగతం గా తనకు లోటని, ఆ కుటుంబానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని చీరాల ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి అన్నారు.

వెంకట సుబ్బమ్మ మృతి తీరనిలోటు
నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కరణం

ఎమ్మెల్యే కరణం

ముండ్లమూరు, డిసెం బరు 31 : మండలంలోని శంకరాపురం మాజీ స ర్పంచ్‌ మందలపు వెంకట సుబ్బమ్మ మృతి వ్యక్తిగతం గా తనకు లోటని, ఆ కుటుంబానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని చీరాల ఎమ్మెల్యే కరణం బల రామకృష్ణమూర్తి అన్నారు. ఆయన శనివారం వెంకట సుబ్బమ్మ దశ దిన కర్మ సందర్భంగా వచ్చి ఆమె చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుమారుడు మాజీ ఎంపీపీ మం దలపు వెంకటరావును పరామర్శించారు. జిల్లా టీడీపీ యువ నాయకులు పమిడి రమేష్‌ వెంకట సుబ్బమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొక్కెర నాగ రాజు, వరగాని పౌలు, చీమకుర్తి టీడీపీ నాయకులు కాట్రగడ్డ వెంకట్రామయ్య, దొనకొండ మాజీ ఎంపీపీ నాగులపాటి శివ కోటేశ్వరరావు, దర్శి, ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీనివాసరావు, టీడీసీ సీనియర్‌ నాయకులు మేదరమెట్ల వెంకటరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సుంకర రాఘవరెడ్డి, జంపాని శ్రీనివాసరావు, సర్పంచ్‌లు కూరపాటి నారాయణ స్వామి, మాజీ స ర్పంచ్‌ ఇందూరి పిచ్చిరెడ్డి, భీమనేని నాసరయ్య, పాలెపోగు డగ్లస్‌, తాతపూడి చెల్లయ్య, సుంకిరెడ్డి, నాగం డ్ల రమణ, పోచం లక్ష్మీరెడ్డి, మేకల సీతారెడ్డి, మేదరమెట్ల కొండలరావు, చుంచు నారాయణ, గోపనబోయిన శ్రీనివాసరావు, కంచుమాటి శ్రీనివాసరావు, వాతల వెంకట సుబ్బారెడ్డి, చాగంటి హనుమంతరావు, వివిధ గ్రామాల నాయకులు, అభిమానులు ఉన్నారు.

Updated Date - 2022-12-31T22:20:33+05:30 IST

Read more