సంగమేశ్వరం వద్ద వనభోజనాలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-11-12T00:37:03+05:30 IST

కార్తీక మాసం సం దర్భంగా పొన్నలూరు మండలం చెన్నిపాడు లోని సంగమేశ్వరం వద్ద ఏటా మాదిరిగానే ఈ నెల 14న వనభోజనాలు ఏర్పాటు చేసినట్లు కొం డపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యన్నారాయణ తెలిపారు.

సంగమేశ్వరం వద్ద వనభోజనాలను విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే స్వామి, సత్య పిలుపు

కొండపి, నవంబరు 11 : కార్తీక మాసం సం దర్భంగా పొన్నలూరు మండలం చెన్నిపాడు లోని సంగమేశ్వరం వద్ద ఏటా మాదిరిగానే ఈ నెల 14న వనభోజనాలు ఏర్పాటు చేసినట్లు కొం డపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి దామచర్ల సత్యన్నారాయణ తెలిపారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవా రం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న సంగమేశ్వరం ఆలయం 2014 సంవత్సరం నాటికి శిథిలావస్థకు చేరిందని ఎ మ్మెల్యే వివరించారు. 2014లో ఆలయాన్ని దా మచర్ల సత్యన్నారాయణ సొంత నిధులతో జీర్ణో ద్ధరణ చేశారన్నారు. విద్యుత్‌, ఇతర వసతులు కల్పించారని తెలిపారు. అప్పటి నుంచి ఏటా కార్తీక మాసంలో సంగమేశ్వర దర్శనం, భక్తు లకు అన్నదానం నిర్వహిస్తున్నారని వివరించా రు. ఆలయాన్ని పునర్నిర్మించాక భక్తులు, ప్ర ముఖుల సందర్శన పెరిగిందన్నారు. ఈ ఏడాది కూడా దామచర్ల సత్యన్నారాయణ సొంత నిధు లతో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారన్నా రు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకు లు పాల్గొంటారని వివరించారు.

లోకేష్‌ పాదయాత్రను జయప్రదం చేయాలి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లో కేష్‌ జనవరి 27 నుంచి కుప్పం నుంచి ఇచ్చా పురం వరకు చేపట్టిన పాదయాత్రను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని దామచర్ల సత్య న్నారాయణ కోరారు. సంక్రాంతి సందర్భంగా కొండపి నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో యువకులతో సదస్సు నిర్వహించనున్నట్లు వెల్ల డించారు. జనవరి నుంచి అన్ని గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని వివరించా రు. వచ్చే ఏడాది మార్చి తర్వాత రైతులతో సం గమేశ్వరం సాధన కోసం కార్యక్రమం కూడా చే పడతామని ఎమ్మెల్యే స్వామి, సత్య ప్రకటించా రు. సమావేశంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్యచౌదరి, పార్టీ నాయకులు బత్తుల నారాయణస్వామి, చాగంరె డ్డి నరసారెడ్డి, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, దామా ము రళి, నన్నూరి సుబ్బరామయ్య, కందిమళ్ల రమేష్‌, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్‌ ఖా ఈషా పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:37:07+05:30 IST