శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో వల్లూరమ్మ

ABN , First Publish Date - 2022-10-02T04:43:00+05:30 IST

మండలంలోని వల్లూరమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈసందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాల చేశారు.

శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో వల్లూరమ్మ
శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో వల్లూరమ్మ

వల్లూరు (టంగుటూరు), అక్టోబరు 1 : మండలంలోని   వల్లూరమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు శ్రీమహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈసందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాల చేశారు. ఉదయం రుద్రాభిషేకం, రాత్రికి గుడి ఉత్సవం  నిర్వహించారు. 

సింగరాయకొండలో.. 

సింగరాయకొండ :  పాతసింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలోని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి శనివారం ఉదయం అభిషేకం, రాత్రి కుంకుమార్చన నిర్వహించారు. అయ్యప్ప దేవస్థానంలో ఉన్న మహాలక్షమ్మకు భక్తుల విశేష పూజలు చేశారు. రైల్వే స్టేషన్‌ రోడ్డులోని చెట్టు మహాలక్ష్మమ్మ మహాలక్ష్మమ్మగా దర్శనమిచ్చారు. కందుకూరు రోడ్డులోని జాలమ్మచెట్టు ఆలయం, పాకలలోని శివాలయం, ఊళ్లపాలెంలోని వాసవీ కన్యాకపరమేశ్వరి ఆలయాల్లోని అమ్మవార్లను భక్తులు దర్శించుకొని పూజలు  చేశారు.

Read more