ఖాళీగా ఉందని కమ్మేస్తున్నారు!

ABN , First Publish Date - 2022-03-05T06:06:32+05:30 IST

ఖాళీగా ఉన్న ప్రభుత ్వ స్థలంపై వైసీపీ కౌన్సిలర్ల కన్ను పడింది. మండలంలోని గోపాలపురం రెవెన్యూ పరిధిలోని భూములు అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్నాయి.

ఖాళీగా ఉందని కమ్మేస్తున్నారు!
అద్దంకిలో వైసీపీ నాయకులు కన్నేసిన స్థలం ఇదే

ప్రభుత్వ భూమిపై వైసీపీ కౌన్సిలర్ల కన్ను

రూ.5కోట్ల  స్థలం అమ్మకానికి ఏర్పాట్లు

ప్లాట్లు వేసేందుకు రంగం సిద్ధం

టైలర్స్‌ సంఘానికి కేటాయింపుతో రగడ

 అద్దంకి, మార్చి 4: ఖాళీగా ఉన్న ప్రభుత ్వ స్థలంపై వైసీపీ కౌన్సిలర్ల కన్ను పడింది. మండలంలోని గోపాలపురం రెవెన్యూ పరిధిలోని భూములు అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్నాయి. దీనికి తోడు నామ్‌ రోడ్డుకు సమీపంలో ఉండటంతో కోట్లు పలుకుతున్నాయి. దీంతో ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల స్థలాలుగా మార్చి సొమ్ము చేసుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. సుమారు వందేళ్లకు పూర్వం అద్దంకి నుంచి శింగరకొండ మీదుగా ప్రస్తుతం ఉన్న భవనాసి చెరువు మధ్యలో నుంచి 100 అడుగుల వెడల్పుతో నర్సరావుపేట రోడ్డు ఉండేది. అనంతరం నర్సరావుపేటకు కొత్త రోడ్డు వేయటంతో  పాత రోడ్డు మూలన పడింది. దానిని రైతులు పొలాలకు రాకపోకల కోసం వినియోగించుకుంటున్నారు. అద్దంకిలో ఎన్‌టీఆర్‌ నగర్‌ ఏర్పాటు సమయంలో రోడ్డు వెడ ల్పు తగ్గించి ఇళ్ల స్థలా లు కేటాయించారు. అనంతరం ఉత్తర రెవెన్యూ పరిధి వరకు ఉన్న రోడ్డు ను కుదించి రెండు వైపు లా స్థలాలను ఆటోనగర్‌కు ఇచ్చారు. ఇక గోపాలపురం రెవెన్యూ పరిధిలో ఉన్న రోడ్డు మాత్రం అలానే ఉంది. కొన్ని చోట్ల పక్క పొలాల రైతులు ఆక్రమించినా ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఖాళీ చేయించారు. గతేడాది గోపాలపురానికి చెందిన పలువురికి జగనన్న కాలనీ కింద కొంతమేర కేటాయించారు. 


ఖాళీగా ఉండటంతో..

గతంలో ఉన్న ఆటోనగర్‌ నుంచి ఇటీవల కేటాయించిన జగనన్న కాలనీ వరకు మధ్యలో రోడ్డు స్థలం సుమారు మూడు ఎకరాల మేర మిగిలింది. రోడ్డుకు 30 అడుగుల మేర మాత్రమే వినియోగిస్తూ మిగిలినది చదునుగా ఉంది.  నామ్‌ రోడ్డుకు, ఖాళీగా ఉన్న రోడ్డు స్థలానికి మధ్యలో రియల్‌ వెంచర్‌లు వేయడంతో స్థలాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో ఆ స్థలంపై ముగ్గురు అధికారపార్టీ కౌన్సిలర్ల కన్నుపడింది. గుట్టుచప్పుడు కాకుండా సుమారు రూ.5 కోట్ల విలువైన 1.50 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకొని స్థలాలుగా మార్చి అమ్మకాలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 


టైలర్స్‌కు కేటాయింపుతో వెలుగులోకి..

ఈ క్రమంలో ఆ స్థలంలో టైలర్స్‌ అసోసియేషన్‌కు రెవెన్యూ అధికారులు మూడు సెంట్లు కేటాయించేందుకు అంగీకరించటంతో (టైలర్స్‌ డే రోజు ఫిబ్రవరి28న) భూమి పూజ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దానికి ముందు రోజు ఆ ప్రాంతం మొత్తం చదును చేయిం చి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తెల్లవారేసరికి టెంట్లు మొత్తం పడేసి ఉన్నా యి. ఏమి జరిగిందని ఆరా తీయగా ముగ్గురు కౌన్సిలర్లు తెర వెనుక ఉండి కఽథ నడిపినట్లు తేలింది. ఆ స్థలం తమ ఆధీనంలో ఉందని, టైలర్స్‌ అసోసియేషన్‌కు కేటాయించటానికి వీలులేదని అడ్డం తిరిగినట్లు తెలుస్తోంది. టైలర్స్‌కు స్థలం కేటాయించటాన్ని పట్టణంలో అధికారపార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ప్రశ్నించారు. ఈ విషయమై ఫిబ్రవరి 28వతేదీ ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఓ కౌన్సిలర్‌, అధికారపార్టీ ప్రధాన నాయకుడి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. ఆ రోజు భూమిపూజ జరగకుండానే ఆగిపోయింది. సుమారు 1.50 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే ముగ్గురు కలిసి వేరే వ్యక్తులకు అమ్మకం చేసే విధంగా ఒప్పందం కూడా కుదిరి కొంతమేర అడ్వాన్స్‌గా కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-03-05T06:06:32+05:30 IST