అసంపూర్తిగా ప్రభుత్వ భవనం
ABN , First Publish Date - 2022-11-25T22:59:55+05:30 IST
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొండపిలోని పశువైద్యశాలను ఏడీ కార్యాలయంగా స్థాయి పెంచింది. భవన నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసింది. కొండపిలోని పొదిలి రోడ్డులో భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది.
ఇదీ పశుసంవర్థక శాఖ ఏడీ కార్యాలయం దుస్థితి
గత టీడీపీ హయాంలో రూ.80లక్షలతో పనులు ప్రారంభం
ఆ తర్వాత పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
కొండపి, నవంబరు 25 : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొండపిలోని పశువైద్యశాలను ఏడీ కార్యాలయంగా స్థాయి పెంచింది. భవన నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేసింది. కొండపిలోని పొదిలి రోడ్డులో భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. తలుపులు, కిటికీలు, నేలపై రాళ్ల ఏర్పాటుతోపాటు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ భవనం పూర్తికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం ఏడీ కార్యాలయం ప్రైవేటు భవనంలో నడుస్తోంది. అసంపూర్తిగా ఉన్న భవనంలో సంచార జాతులవారు జీవిస్తున్నారు. వీరితోపాటు కొందరు మందుబాబులు మద్యం తాగేందుకు వాడుకుంటున్నారు. భవనం చుట్టూ చిల్లచెట్లు మొలిచాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పశుపోషకులకు మెరుగైన సేవలందించాలని ప్రజలు కోరుతున్నారు.