ఉలిచి ఎస్పీకాలనీ ప్రాథమిక పాఠశాల కొనసాగింపు

ABN , First Publish Date - 2022-08-05T05:16:11+05:30 IST

ఒంగోలు మండలం ఉలిచి ఎస్సీకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 3,4,5తరగతులను అక్కడే కొనసాగించేలా ఉన్నతాధి కారులు చర్యలు తీసుకున్నారు.

ఉలిచి ఎస్పీకాలనీ ప్రాథమిక పాఠశాల కొనసాగింపు




ఒంగోలు(రూరల్‌), ఆగస్టు 4: ఒంగోలు మండలం ఉలిచి ఎస్సీకాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 3,4,5తరగతులను అక్కడే కొనసాగించేలా ఉన్నతాధి కారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక స్కూలులోని 3 ,4 ,5 తరగతుల వి ద్యార్థులను కిలోమీటర్‌ దూరంలోని జడ్పీహైస్కూలులో విలీనం చేశారు. అ యితే ఈ మార్గంలో పెద్దచెరువు ఉంది. రోడ్డు రద్దీగా ఉండటంతో పిల్లలను హైస్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయంపై 20రోజులుపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీపీఎంకు చెందిన ఎ మ్మెల్సీలు పాఠశాలను సందర్శించి గ్రామస్థులు మాట్లాడారు. ఈక్రమంలో ఇ క్కడి సమస్యలను ఉన్నతాధికారుల అదేశాలతో ఎంఈవో నివేదించారు. దీంతో ఎస్సీకాలనీలో 3,4,5 తరగతులు విద్యార్ద్థులు విద్య అభ్యసించటానికి ఆదేశాలు ఇచ్చారు దీంతో హైస్కూలులో చేరిన పిల్లలు తిరిగి ఇక్కడ చేరా రు. స్కూలులో 40మంది విద్యార్థులు, ఇరువురు ఉపాధ్యాయులు ఉన్నారు.


Updated Date - 2022-08-05T05:16:11+05:30 IST