త్రివర్ణ శోభితం

ABN , First Publish Date - 2022-08-16T06:15:50+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

త్రివర్ణ శోభితం
ర్యాలీ ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు

స్ఫూర్తినింపిన సాంస్కృతిక కార్యక్రమాలు  

గిద్దలూరు, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 400 మోటార్‌ సైకిళ్లతో పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలంతో స్వాతంత్య్రం లభించిందన్నారు. 100 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాలలో టీడీపీ మండల  అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ షాన్షావలి, మాజీ అధ్యక్షులు షేక్‌ మస్తాన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌, టీడీపీ నాయకులు బిల్లా రమేష్‌, పెద్దభాషా, తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలు వృథాకారాదు

మార్కాపురం(వన్‌టౌన్‌) : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యజించిన అమరుల త్యాగాలు వృథా కారాదని, ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం 750 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు పట్టణ వీధుల్లో ప్రదర్శించారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి జాతీయ పతాకం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌, కమిషనర్‌ గిరికుమార్‌, డీఈ షేక్‌ సుభానీ, ప్రధానోపాధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. శాఖా గ్రంథాలయంలో గ్రంథపాలకుడు శివారెడడ్డి, ఆర్టీసీ బస్టాండ్‌లో డిఎం ఎస్‌.నరసింహులు, జనసేన కార్యాలయం వద్ద ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌, సాయిబాలాజీ ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్‌ ప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్‌ మస్తాన్‌వలి, వెంకటేశ్వర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి.సత్యనారాయణరెడ్డి, గాంధీ పార్క్‌లో కౌన్సిలర్‌ డా.కనకదుర్గ, 16వ వార్డులో కౌన్సిలర్‌ డి.హర్షితాబాబీ, మెడికల్‌ అసోసియేషన్‌ హాల్‌లో అధ్యక్షుడు శ్రీనివాసులు, కమలా పాఠశాలలో చైర్మన్‌ పి.కేశవరావు, పవన్‌ కుమార్‌లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

విద్యార్థులకు జ్ఞాపికల అందజేత

బేస్తవారపేట(కంభం) : ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో   గెలుపొందిన విద్యార్థులకు సోమవారం స్పందించే హృదయాలు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చైర్మన్‌ పులి శ్రీనివాసప్రసాద్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు సయ్యద్‌ జాకీర్‌ హేస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

బేస్తవారపేట :  మండల పరిషత్‌ కార్యలయం వద్ద ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎ.జీతేంద్ర,మాజీ సైనికుల కార్యాలయం వద్ద బోల్లా బాలిరెడ్డి జాతాయ జెండాను ఆవిష్కరించారు.

కంభం: మండలంలో పలు ప్రభుత్వ.ప్రయివేట్‌ కార్యలయాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. కంభం లైన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌ ,మాజీ సైనికుల కార్యలయం వద్ద సీ.ఐ రాజేష్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఎంపీడీవో కార్యాలయం వద్ద

రాచర్ల : ఎంపీ డీవో కార్యాలయంతో పాటు సచివాలయంలో ఎంపీ డీవో కవితాచౌదరి, ఎంపీపీ షేక్‌ ఖాశింభీలు జెండాను ఎగురవేశారు.  ఎస్‌ ఐ బి.మహేష్‌,  వ్యవసాయ శాఖాధికారి షేక్‌రఫిలు వారి కార్యాల యాల్లో జెండా ఎగుర వేశారు. మాజీ సైనికుల కార్యాలయంలో జిల్లా సైనికుల అధ్యక్షుడు కెప్టెన్‌ జి.అంకన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్పందన ఉన్నత పాఠశాల కరస్పాండెంట్‌ పేర్ల సుధీరర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనుమలపల్లెలో సర్పంచ్‌ శిరిగిరి రమేష్‌, చోళ్ళవీడు సర్పంచ్‌ గోతం నారాయణ, ఆకవీడు సర్పంచ్‌ తలపాటి దేవదానం, రాచర్ల సర్పంచ్‌ రాయలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు చిట్టెం ఎలిసమ్మ, చినగానిపల్లె సర్పంచ్‌ పగడాల రమేష్‌, అనుమలవీడు పంచాయతీ కార్యదర్శి గణేష్‌, సర్పంచ్‌ లతీఫ్‌ సచివాలయాల్లో జెండాలను ఆవిష్కరించారు. బద్దీటి ప్రవీణ్‌కుమార్‌ అనుమలవీడు విద్యార్థులకు టీషర్టులను అందజేశారు. 

తర్లుపాడు : మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలలు, కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ జెండా ఆవిష్కరించారు. ఎంఈవో కార్యాలయంలో ఎంపీడీవో ఎస్‌.నరసింహులు, వెలుగు కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యులు వెన్నా ఇందిరా జెండా ఎగురవేశారు. తహసీల్దార్‌ టీవీ.కృష్ణారెడ్డి, ఎస్‌ఐ పి.ముక్కంటి, వైద్యాధికారి వంశీకృష్ణ, ఏవో చంద్రశేఖర్‌ వారి వారి కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరించారు.  తర్లుపాడు సర్పంచ్‌ పల్లెపోగు వరాలు, కలుజువ్వలపాడు సర్పంచ్‌ ఎం.శిఖోమణి, మీర్జపేట బి.పెద్దమీరయ్యలు సచివాల యాల్లో జెండా ఎగురవేశారు. కలుజువ్వలపాడు నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపాల్‌ ఎం.శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులు కవాతు నిర్వహించారు. సీతానాగులవరం ప్రాథమిక పాఠశాలలో భారతదేశ చిత్రపటాన్ని విద్యార్థులు ముగ్గు రూపంలో తీర్చిదిద్దారు.

మార్కాపురం : స్వాతంత్య్రదినోత్సవం సందర్భం గా పభుత్వ, ప్రైవేటు పాఠ శాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిం చారు.  స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. డీ ఎస్పీ కార్యాలయంలో ఎస్‌డీపీవో కిశోర్‌కుమార్‌, అటవీశాఖ కార్యాలయంలో డీఎఫ్‌వో విఘ్నేష్‌ అవ్వాపు, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, టీడీపీ పట్టణ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, గొట్టిపడియలో సర్పంచి వేల్పుల వెంకట లక్ష్మిలు జాతీయ జండాలను ఆవిష్కరించారు.

పెద్దారవీడు మండలంలో ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. సచివాలయం వద్ద సర్పంచ్‌ దుగ్గెం చెన్నమ్మ, మండల టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి జాతీయ జండాను ఆవిష్కరించారు. 

పుల్లలచెరువు : స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో భాగంగా తహసీల్దార్‌ కె దాసు,  ఎస్‌ఐ వేముల సుధాకర్‌, ఏపీఎం వెంకటయ్య, పశువైద్యాధికారి నాగుల్‌మీరా,  వైద్యాధికారి సక్రూనాయక్‌లు వారి వారి కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించారు. కవలకుంట్లలో సర్పంచి ఆవుల లక్ష్మిదేవి, చాపలమడుగులో సర్పంచి టి సత్యనారాయణరెడ్డి, మర్రివేముల పాఠశాలలో పాఠశాల చైర్మన్‌ అచ్చయ్య, ఎంఎన్‌డీకే పాఠశాలలో ప్రిన్సిపాల్‌ వేముల వీరయ్య, బీజేపీ అధ్వర్యంలో ఈశ్వర్‌లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.  కార్యక్రమంలో  అధికారులు, వివిధ పార్టీ నాయకులు,విద్యార్థులు పాల్గొన్నారు. 

పెద్ద దోర్నాల : మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ గుమ్మాపద్మజ జాతీయపతాకాన్ని అవిష్కరించారు. తహసీల్దారు డీ.ఎలీషా, ఎస్సై శ్రీనివాసరావు, ఏవో డీ జవహర్‌లాల్‌ నాయక్‌, పశువైద్యాధికారి అరుణ్‌కుమార్‌లు వారి వారి కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, కస్తూరిభా గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్‌ అనూష, ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాల వద్ద ప్రిన్సిపాల్‌ ఎం.చిట్టిబాబు, సామాజిక ఆరోగ్య కేంధ్రం వద్ద సూపరింటెండెంట్‌ పీ.భాస్కర్‌కుమార్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ ఎం మహాలక్ష్మమ్మ, పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచి త్తూరి హారిక, తుమ్మలబైలు ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి, స్థానిక బీఎం డిగ్రీ కళాశాల, వసంత జూనియర్‌ కళాశాల వద్ద చైర్మన్‌ బట్టు రమణారెడ్డి ఆ యా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల వద్ద జాతీయ పతాకం ఆవిష్కరించారు. 

ఎర్రగొండపాలెం : పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జాతీయజెండాను సోమవారం ఆర్యవైశ్యనాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం నాయకులు కె పుల్లారావు, కొత్తమాసు సుబ్రమణ్యం, గోళ్ల సుబ్బారావు, సూరే వెంకటస్వామి, మల్లిఖార్జున, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం :  తహసీల్దారు కార్యాలయం ఎదుట తహసీల్దారు కె దాస్‌, పోలీసుస్టేషన్‌ వద్ద ఎస్‌. ఐ జి కోటయ్య, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ డి కిరణ్‌గౌడ్‌, పంచాయతీ ఆపీసు ఎదుట సర్పంచి ఆర్‌ అరుణాబాయ్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద పీఎంసీ  చైర్మన్‌ సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, మండలంలోని అన్ని ప్రాఽథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసీల్దారుకార్యాలయం వద్ద ఎఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ డి కిరణ్‌గౌడ్‌, జడ్పీటీసీ సిహెచ్‌ విజయబాస్కర్‌,  ఎస్‌ .ఐ జి కోటయ్య, డి టి ఆశోక్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో నివాసగృహలపై ప్రజలే స్వచ్చంధంగా జెండాను ఎగురవేశారు.త్రిపురాంతకం :  స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సుబ్బారెడ్డి జెండా ఆవిష్కరిం చారు. తహసీల్దార్‌ వి.కిరణ్‌, సీఐ ఎం. రాంబాబు, ఏవో నీరజ, ఎంఈవో మల్లికార్జుననాయక్‌లు వారి కార్యాల యాల్లో జెండా ఆవి ష్కరించారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచ్‌లు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో పాఠశాలల కమిటీ చైర్మన్‌లు జెండాలను ఎగురవేశారు.

గిద్దలూరు టౌన్‌ : పట్టణంలోని కోర్టు ఆవరణలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ను జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్‌ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మరువవద్దని,  వారి అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.మేరిసారా దానమ్మ గాంధీజీ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నాగేంద్రబాబు, న్యాయవాదులు భాస్కర్‌రావు, హిమశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి,  కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుస్టేషన్‌ ఆవరణలో సీఐ ఎం.డి.ఫిరోజ్‌ జెండాను ఆవిష్కరించారు. ఎస్‌ఐ బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య జెండాను ఎగురవేశారు. వైస్‌చైర్మన్లు ఆర్‌.డి.రామక్రిష్ణ, కాతా దీపిక, కౌన్సిలర్లు గడ్డం భాస్కర్‌రెడ్డి, లొక్కు రమేష్‌, కమిషనర్‌ రామక్రిష్ణయ్య, కో-ఆప్షన్‌ సభ్యులు దమ్మాల జనార్థన్‌ తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ కడప లక్ష్మీదేవి జెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో రంగనాయకులు పాల్గొన్నారు. నగర పంచాయతీ పరిధిలోని కొంగళవీడు రోడ్డులోని సచివాలయం వద్ద కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ మస్తాన్‌వలి జెండాను ఆవిష్కరించారు. కౌన్సిలర్లు మానం బాలిరెడ్డి, గర్రె సునీత పాల్గొన్నారు. ముండ్లపాడు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ పోలా లక్ష్మీదేవి, కొంగళవీడులో టి.లక్ష్మీప్రసన్న, నరవ నంద శ్రీనివాసులు, కంచుపల్లె నందు రాజమ్మలు జెండాలను ఎగురవేశారు. వివేకానంద కళాశాల నందు ప్రిన్సిపాల్‌ పోలిరెడ్డి జెండాను ఎగురవేశారు. పట్టణంలోని విశ్వభారతి పాఠశాల నందు కరస్పాండెంట్‌ రంగస్వామిరెడ్డి జెండాను ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. క్రిష్ణవేణి టాలెంట్‌ స్కూలులో ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరెడ్డి, జీవనజ్యోతి కళాశాల నందు ప్రిన్సిపాల్‌ మహబూబ్‌షరీఫ్‌ జెండాను ఎగురవేశారు. పట్టణంలోని తాలూకా మాజీసైనికుల కార్యాలయంలో సీఐ ఫిరోజ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఎగురవేయగా సంఘం అధ్యక్షులు కెప్టెన్‌ ఓబులేసు, ఉపాధ్యక్షులు లక్ష్మీరంగయ్య, కార్యదర్శి సంగీతరావు, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్యాలయాల్లో ఆయా అధికారులు జెండాలను ఎగురవేశారు. 

గిద్దలూరు టౌన్‌ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గిద్దలూరు మండలం నరవ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు మొగిలిశెట్టి నరసింహులు భార్య పార్వతమ్మను సోమవారం తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌, నరవ సర్పంచ్‌ బండి శ్రీనివాసులు సన్మానించారు. ఈసందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహు లు సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో వీఆర్‌ వోలు రంగయ్య, రామయ్య, వీరనారాయణ పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : నియోజకవర్గ తెలుగుయువత ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎందరో త్యాగధనుల పోరాటాలకు ప్రతీక నేడు మనజరుపుకుంటున్న 75 వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్రలు టీడీపీ ఆపీసు ఎదుట జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుయువత ఆధ్వర్యంలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, డాక్టరు రవీంద్ర బైక్‌ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ ర్యాలీ పట్టణ పురవీధుల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఐదు మండలాల, టీడీపీ అధ్యక్షులు,  టీడీపీ ముఖ్యనాయకులు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షకార్యదర్శులు, మండల తెలుగుయువత నాయకులు, పాల్గొన్నారు.

కొమరోలు :  తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాజారమేష్‌ ప్రేమ్‌కుమార్‌, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కామూరి అమూల్య, గ్రంథాలయంలో జెడ్పీటీసీ సభ్యులు సారె వెంకటనాయుడు, సర్వైట్‌ పాఠశాల, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ సాంబశివయ్య, స్థానిక వైద్యశాలలో చైతన్యదీపక్‌, గ్రామ సర్పంచులు జెండా ఎగురవేశారు. సర్వైట్‌ పాఠశాలలో విద్యార్ధులు వివిధ సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించారు. 

Updated Date - 2022-08-16T06:15:50+05:30 IST