విధుల్లో విఫలమైనప్పుడే బదిలీలు

ABN , First Publish Date - 2022-12-15T23:15:29+05:30 IST

ఎస్సైలను పదేపదే బదిలీలు చేయడం ఉండదని, వి ధుల్లో, పాలనలో విఫలమైనప్పుడే వారిని తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేస్తున్నామని ఎస్పీ మలికగర్గ్‌ అన్నారు. జరుగుమల్లికి వచ్చిన ఎస్సైలు ప దేపదే బదిలీ అవుతున్న విషయాన్ని విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకురాగా ఆమె పైవిధంగా స్పం దించారు.

విధుల్లో విఫలమైనప్పుడే బదిలీలు

ఎస్పీ మలికగర్గ్‌

జరుగుమల్లి (కొండపి), డిసెంబరు 15: ఎస్సైలను పదేపదే బదిలీలు చేయడం ఉండదని, వి ధుల్లో, పాలనలో విఫలమైనప్పుడే వారిని తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చేస్తున్నామని ఎస్పీ మలికగర్గ్‌ అన్నారు. జరుగుమల్లికి వచ్చిన ఎస్సైలు ప దేపదే బదిలీ అవుతున్న విషయాన్ని విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకురాగా ఆమె పైవిధంగా స్పం దించారు. బదిలీ కాలం రెండేళ్లు పూర్తయిన త ర్వాతే అని, అయితే ప్రత్యేక పరిస్థితుల్లో, స్థానికం గా ప్రజల నుంచి అధికారులపై విమర్శలు రావ డం, శాంతి భద్రతల సమస్యలను సరిగా పరిష్కరించలేని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎస్సైల బదిలీలు నిర్ణీత గడువుకన్నా ముందుగా జరుగుతుంటాయన్నారు. గురువారం మధ్యాహ్నం జరుగుమల్లి పో లీ్‌సస్టేషన్‌ను ఆమె సందర్శించారు. ఈసందర్భం గా రికార్డులు పరిశీలించారు. అనంతరం మహి ళా పోలీసులు ఎస్సీని సన్మానించారు.

కానిస్టేబుల్‌కు ప్రశంస

ఇటీవల తుఫాన్‌ సమయంలో ఎం.నిడమలూ రు వద్ద ముసివాగు ఉధృతికి వాగులో కొట్టుకుపోతున్న ఎం.నిడమలూరుకు చెందిన మారెళ్ల రమణయ్యను అక్కడే కాపలా ఉన్న టంగుటూరు కా నిస్టేబుల్‌ డి.రాజావెంకటేశ్వర్లు కాపాడిన విష యం తెలిసిందే. ఈసందర్భంగా జరుగుమల్లి పో లీ్‌సస్టేషన్‌లో ఎస్సీ మలికెగర్గ్‌ కానిస్టేబుల్‌ రమణయ్యను ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ యు.నాగరా జు, డీఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, ఎస్పీ సీసీ నారాయణ, సీఐ రంగనాథ్‌, ఎస్సైలు వెంకటేశ్వరరావు, ఖాదర్‌బాషా, ఫాతిమా పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:15:31+05:30 IST