అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు త్వరలో ఉపకరణాలు
ABN , First Publish Date - 2022-03-05T05:38:27+05:30 IST
జిల్లాలోని అర్హులైన దివ్యాంగ విద్యార్థులు అందరికీ అవసరమైన ఉపకరణాలు త్వరలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ) డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.
ఏపీసీ డాక్టర్ బి.శ్రీనివాసరావు
ఒంగోలు విద్య , మార్చి 4: జిల్లాలోని అర్హులైన దివ్యాంగ విద్యార్థులు అందరికీ అవసరమైన ఉపకరణాలు త్వరలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ) డాక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. గతనె ల 17,8,19 తేదీల్లో ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను సూచించారని, మొత్తం 384 దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఒంగోలులోని సమగ్రశిక్ష మీటిం గ్ హాలులో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన దివ్యాంగులందరికీ హియరింగ్ ఎ యిడ్స్, వీల్‌ఛైర్స్, ట్రైసైకిళ్ళు, క్రచ్చస్ వంటివి ఉచితంగా త్వరలో అందజేస్తా మన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఎం.రమేష్, రిసోర్సుపర్సన్లు మాలిక్, వెంక టేశ్వర్లు, శ్రీధర్, నాగలక్ష్మి, మల్లేశ్వరి, శిఖామణి తదితరులు పాల్గొన్నారు.