పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి

ABN , First Publish Date - 2022-03-18T05:46:46+05:30 IST

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి

పొదిలి, మార్చి 17 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. గురు వారం వాగుమడుగు, ఆముదాలపల్లి, నిమ్మవరం, కెల్లంపల్లి, మూగచింతల గ్రామా లకు చెందిన 453 బేళ్లు అమ్మకానికి ఉంచారు. పొగాకు వేలం కేంద్రం ప్రారంభించిన నాలుగు రోజులకే కిలోకు రూ.6 తగ్గించారు. దీంతో రైతు సంఘం నాయకులు పొగా కు వేలం కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు తీరును పరిశీలిం చారు. గత సంవ త్సరానికీ ఈ సంవత్సరానికి ధరలలో పెద్ద మార్పు కనిపించకపోవడాన్ని గుర్తించారు. దీంతో గిట్టుబాటు కల్పించాలని బోర్డు కార్యాలయం వద్ద రైతులతో కలిసి నిరసనకు దిగారు. అనంతరం వేలం నిర్వాహణాధికారి గిరిరాజ్‌కుమార్‌తో చర్చించారు. ఈసం వత్సరం పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని తుఫాన్‌ కారణంగా పంట దెబ్బతిన్నదని సరైన ధరలు కల్పించకపోతే రైతులు మరింత నష్టపోతారన్నారు. ఎక్కువ కంపెనీలు వచ్చే విధంగా అధికారులు సహకరించాలన్నారు.అత్యధిక ధర కిలో రూ.200 సరాసరి ధర రూ.179  వచ్చేలా చూడాలని గిరిరాజ్‌కుమార్‌ని కోరారు.   రైతు సంఘం నాయకులు పిల్లి తిప్పారెడ్డి, వెంకటేశ్వర్లు, ఎం.రమేష్‌ పాల్గొన్నారు.Read more