శ్మశాన స్థలంలో హెల్త్‌ క్లినిక్‌ వద్దు

ABN , First Publish Date - 2022-10-18T04:12:41+05:30 IST

తురకపాలెం గ్రామంలోని సర్వే నంబర్‌ 255లో పూర్వం నుంచి ఉన్న శ్మశాన స్థలంలో హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని నిర్మించవద్దని గ్రామ దూదేకులు విజ్ఞప్తి చేశారు.

శ్మశాన స్థలంలో హెల్త్‌ క్లినిక్‌ వద్దు

తురకపాలెం దూదేకులు విజ్ఞప్తి 

తాళ్లూరు, అక్టోబరు 17 : తురకపాలెం గ్రామంలోని సర్వే నంబర్‌ 255లో  పూర్వం నుంచి ఉన్న శ్మశాన స్థలంలో హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని నిర్మించవద్దని  గ్రామ దూదేకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారంతా  సోమవారం తహసీల్దార్‌ రామ్మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు. తాతల కాలం నుంచి ఆ స్థలాన్ని తమ కులస్తులు శ్మశానంగా వాడుకుంటున్నట్లు తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. శ్మశాన స్థలం పక్కనే ఉన్న స్థలంలో హెల్త్‌ క్లినిక్‌ కోసం 2020లో ప్రభుత్వం కేటాయించి జియోటాగింగ్‌ కూడా చేసిందన్నారు.  ఆ స్థలంలో రైతు భరోసా కేంద్రం, సచివాలయ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. హెల్త్‌ క్లినిక్‌ కోసం జియోట్యాగింగ్‌ చేసిన స్థలంలో ఓ వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నా పట్టించుకోని అధికారులు దూదేకులకు చెందిన శ్మశాన స్థలంలో క్లినిక్‌ నిర్మించాలని చూడడం ఎంతవరకు న్యాయమన్నారు. గ్రామంలో మూడు కుటుంబాలే తమ వర్గానికి చెందిన వారు వున్నారన్న కారణంలో అన్యాయం చేస్తున్నారన్నారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు. గ్రామానికి చెందిన షేక్‌ నారాయణవలి, బాబు, షేక్‌ నబీసాహెబ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T04:12:41+05:30 IST