రెండు గ్రామాలలో చోరీ
ABN , First Publish Date - 2022-08-18T04:49:53+05:30 IST
రెండు గ్రామాలలో ఇద్దరు దొంగలు మోటార్ బైక్‌పై వచ్చి చోరీలకు పాల్పడ గా గోపాలపురం గ్రామస్థులు వెంటపడటంతో ఒకరు దొరికిపోయాడు. మరొకడు పరారయ్యాడు. స్థానికుల కథనం మేరకు ఒంగోలుకు చెందిన ఇద్దరు పాత నేరస్థులు మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత బల్లికురవ మండలంలోని వి.కొప్పెరపాడులో పంచాయతీ వార్డు మెంబర్, టైలర్ గుర్రాల శ్రీనివాసరావు ఇంట్లో చోరీకి పాల్పడి రూ. 6,500 ల నగదు, సెల్ ఫోన్ అపహరించారు. అనంతరం అద్దంకి మండలం గోపాలపురంలో మందపాటి శ్రీనివాసరావు ఇంట్లో చోరీలకు పాల్పడ్డారు.

గోపాలపురంలో దొరికిన దొంగ
మరొకరు పరారీ
దొంగను పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు
అద్దంకి, ఆగస్టు17: రెండు గ్రామాలలో ఇద్దరు దొంగలు మోటార్ బైక్‌పై వచ్చి చోరీలకు పాల్పడ గా గోపాలపురం గ్రామస్థులు వెంటపడటంతో ఒకరు దొరికిపోయాడు. మరొకడు పరారయ్యాడు. స్థానికుల కథనం మేరకు ఒంగోలుకు చెందిన ఇద్దరు పాత నేరస్థులు మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత బల్లికురవ మండలంలోని వి.కొప్పెరపాడులో పంచాయతీ వార్డు మెంబర్, టైలర్ గుర్రాల శ్రీనివాసరావు ఇంట్లో చోరీకి పాల్పడి రూ. 6,500 ల నగదు, సెల్ ఫోన్ అపహరించారు. అనంతరం అద్దంకి మండలం గోపాలపురంలో మందపాటి శ్రీనివాసరావు ఇంట్లో చోరీలకు పాల్పడ్డారు. ఇద్దరు దొంగలలో ఒకరు మోటార్‌బైక్‌పై రోడ్డుపై ఉండగా, మరొకడు చోరీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గోపాలపురంలో మోటార్‌బైక్‌పై ఉన్న వ్యక్తిని గ్రామస్థులు గమనించి వెంబడించారు. దీంతో అతను అద్దంకి వైపు పరారయ్యాడు. మరో దొంగ పొలాలలోకి పరారయ్యాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరారైన దొంగ శింగరకొండ మీదుగా 99 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం సమీపంలోకి వచ్చాడు. దీంతో కాపు కాసి ఉన్న గ్రామస్థులు దొంగను పట్టుకున్నారు. దొంగ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను గుర్తించిన గ్రామస్థులు స్వాధీనం చేసుకొని స్విచ్ ఆన్‌చేశారు. ఆ సమయంలో ఆ సెల్‌ఫోన్‌కు కొప్పెరపాడుకు చెందిన శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. ఆ సెల్‌ఫోన్ చోరీకి గురైనట్లు, తన ఇంట్లో 6,500 రూపాయల నగదు కూడా చోరీ జరిగినట్లు చెప్పాడు. దీంతో దొరికిన వ్యక్తి దొంగగా నిర్ధారించుకున్న గోపాలపురం గ్రామస్థులు తమ గ్రామానికి తీసుకు వెళ్ళి తమదైన శైలిలో ప్రశ్నించారు. అదే సమయంలో గోపాలపురంలోని ఇంట్లో చోరీ చేసిన సమయంలో దొంగ ఇయర్ ఫోన్స్ కూడా దొంగలించాడు. ఆ ఇయర్‌ఫోన్ ్స ను గుర్తించిన మందపాటి శ్రీనివాసరావు ప్రశ్నించటంతో వాళ్ల ఇంట్లో దొంగలించినవి గా చెప్పాడు. అప్పటి వరకు గోపాలపురంలో చోరీ జరిగిన విషయం గ్రామస్థులకు తెలియలేదు. దొంగ చెప్పిన విషయాల ఆధారంగా వెతకగా గోపాలపురంలో శ్రీనివాసరావు ఇంట్లో చోరీ చేసిన 10 సవర్ల బంగారం, లాప్‌ట్యాప్, ఇతర గుర్తింపు కార్డులను ఆ ఇంటి సమీపంలో పడవేసినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద 10 వేల రూపాయల నగదు కూడా గుర్తించారు. విషయాన్ని పోలీస్‌ల దృష్టికి తీసుకుపోవటంతో అద్దంకి సీఐ రాజమోహనరావు ఆధ్వర్యంలో సంఘటనాస్థలానికి చేరుకొని విచారించారు. పట్టుబడ్డ దొంగను పోలీసులకు అప్పగించారు. చోరీలకు పాల్పడ్డ ఇద్దరు ఒంగోలుకు చెందిన పాతనేరస్థులుగా తెలుస్తోంది.
దొంగలకు వత్తాసుగా ఫోన్ చేసిన సీసీఎస్ పోలీస్...
గోపాలపురంకు చెందిన కొందరు వ్యక్తులు దొంగ చెప్పిన ఫోన్ నెంబరు ఆధారంగా ఒంగోలులో ఉన్న కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తరువాత ఆ ఫోన్‌నెంబరు నుంచి ఒంగోలు సీసీఎస్ పోలీ్‌సస్టేషన్ కానిస్టేబుల్ ఫోన్‌చేసి దొంగకు వత్తాసుగా మాట్లాడటంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. దొంగను పట్టుకున్న గ్రామస్థులను అభినందించాల్సింది పోయి దొంగకు వత్తాసుగా మాట్లాడటం పట్ల గ్రామస్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.