రైతులను విస్మరించిన వైసీపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-12-15T00:23:32+05:30 IST
మాండస్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇ ప్పటికైనా ఇంట్లో నుంచి బయటకు రావాలని టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామ చర్ల జనార్దన్ డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల న ష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవా లని కోరుతూ బుధవారం ఒంగోలులో కలెక్టర్ ది నేష్‌కుమార్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అం దజేశారు.
ఇప్పటికైనా జగన్‌రెడ్డి ఇంట్లోంచి బయటకు రావాలి
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల ధ్వజం
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 14: మాండస్ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇ ప్పటికైనా ఇంట్లో నుంచి బయటకు రావాలని టీ డీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామ చర్ల జనార్దన్ డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల న ష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవా లని కోరుతూ బుధవారం ఒంగోలులో కలెక్టర్ ది నేష్‌కుమార్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అం దజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దామచర్ల మా ట్లాడుతూ తుఫాన్ కారణంగా రైతులు పెట్టిన పెట్టుబడులతో పాటు రాబడిని కూడా కోల్పోయా రని తెలిపారు. ఒక్కొక్క రైతు సరాసరిన రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు తుఫాన్ కారణంగా నష్టపోయారని చెప్పారు. ఇప్పటికే పండించిన ఉ త్పత్తులకు గిట్టుబాటు ధరలు లేక తల్లడిల్లిపోతు న్న రైతులను ప్రస్తుతం కురిసిన భారీవర్షాలతో తీ వ్రంగా దెబ్బతీసిందని, దీనివల్ల వారు ఆత్మహత్య లు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్య క్తం చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకు నేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాం డ్ చేశారు. అయితే ప్రభుత్వపరంగా పట్టించుకో వడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగ న్మోహన్‌రెడ్డి ఇంట్లోంచి బయటకు రాకుండా ఉం డటం దుర్మార్గంగా ఉందన్నారు. ఇప్పటికైనా ము ఖ్యమంత్రి బయటకు వచ్చి రైతులను పరామర్శిం చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశా రు. ఇంకొక వైపు జిల్లాలో వర్షాల కారణంగా రైతు లు తీవ్రంగా నష్టపోయి ఉంటే అధికార పార్టీ మ ంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం బాధితులను కూడా పరామర్శించకపోవడం దుర్మార్గంగా ఉందని ఆరో పించారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం, ఫంక్షన్లు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. మరోనాలుగైదు రోజుల్లో ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి అఽధికార పార్టీ నేతలతో సమాశాలు నిర్వహిస్తుండటంతో ఆయన మెప్పు పొందేందుకు గడపగడపకు కార్యక్రమంలో పా ల్గొంటున్నారనే తప్ప వర్షాల కారణంగా నష్టపో యిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రై తులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే పరి హారం ఇవ్వాలని దామచర్ల డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, రావుల పద్మజ, కొఠారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.