మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-10-20T23:17:10+05:30 IST

మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని మున్సిపాల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం పట్టణంలోని అంబే డ్కర్‌ భవన్‌లో చేయూత లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
చేయూత చెక్కును అందజేస్తున్న మంత్రి సురేష్‌

మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఎర్రగొండపాలెం(పుల్లలచెరువు), సెప్టెంబరు 29: మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని మున్సిపాల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం పట్టణంలోని అంబే డ్కర్‌ భవన్‌లో చేయూత లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రైతులకు మైక్రో ఇరిగేషన్‌ కింద డ్రిప్‌పైపులు పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలోని ఐదు మండలాల్లో వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద 11,909 మంది లబ్ధిదారులకు రూ.22.32 కోట్ల  నిధులు ఒక్కొక్కరికి రూ.18,500 చొప్పున వారి అకౌంట్లలో జమ చేసిందన్నారు. మార్కెట్‌ యార్డువద్ద జరిగిన సమావేశంలో మాట్లాడు తూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతులకు 90 శాతం రాయితీలో డ్రిఫ్‌ పరికరాలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ డి  బాబురావు, డీఎల్‌డీవో సాయికుమార్‌, వెలుగు ఏసీ లక్ష్మిరెడ్డి, తహసీల్దార్‌ రవీంద్రరెడ్డి, ఏపీఎంలు నూనె వెంకటయ్య, సైమన్‌, ప్రసాద్‌, కృపమ్మ,పి శ్రీను, ఏఎంసీ చైర్మన్‌ వుడుముల శ్రీనివాసరెడ్డి,ఎంపీపీలు కోట్ల సుబ్బారెడ్డి, కిరణ్‌ గౌడ్‌, వైపాలెం సర్పంచి అరుణాబాయి, జేడ్పీటీసీ భాస్కర్‌,పుల్లలచెరువు వైసీపీ మండల కన్వీనరు రెంటపల్లి సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు మూర్తిరెడ్డి, ఓబుల్‌రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

పొదిలి రూరల్‌ :వైసీపీ ప్రభుత్వం మహిళలకు చేయూత ద్వారా భరోసా కల్పిస్తోందని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో మూడవ విడత చేయూత చెక్కుల పంపిణీ  జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా లబ్ది పొందిన వారు ఇతర జీవనోపాధిని మెరుగు పరుచుకో వాలన్నారు. చేయూత మూడవ విడత కింద రూ.5.21 కోట్లు,  మంజూరైనట్లు తెలిపారు. కరోనా కాలంలో కూడా వెనుకడుగు వేయకుండా క్యాలెండర్లో ఇచ్చిన తేదీని తప్పకుండా పథకాలను ముఖ్య మంత్రి అమలు చేస్తున్నారన్నారు. ఎంపీడీవో శ్రీకృష్ణ, ఈవోఆర్డీ రాజశేఖర్‌ వైసీపీ మండల కన్వీనర్‌ దుగ్గెంపూడి శ్రీను, పట్టణ అధ్యక్షురాలు నూర్జహాన్‌, మాజీ ఎంపీపీ కోవెలకుంట్ల నరసింహారావు, వైసీపీ నాయకుడు సుబ్బారావు ఓబులక్కపల్లి సర్పంచ్‌ సుబ్బారెడ్డి, మాదాల వారిపాలెం సొసైటి అధ్యక్షుడు బ్రహ్మరెడ్డి, ఏపీఎం మాణిక్యాలరావు, కార్యదర్శులు, వెల్‌ఫేర్‌ అసిస్టెంట్‌లు, సీసీలు, వీవోఏలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

సమావేశంలో వసతులు కరువు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తగు ఏర్పాట్లు చేయకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడ కుర్చీలు ఏర్పాటు చేయకపోవడం, నీడ కూడా లేకపోవడతో కొంత మంది ఎండలో నిలబడి సమావేశంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింద న్నారు.

Read more