దోర్నాల విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2022-11-02T22:03:41+05:30 IST
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పోటీలలో దోర్నాల ఏపీటీడబ్ల్యూఆర్ (బా లురు) విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
పెద్ద దోర్నాల నవంబరు 2: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పోటీలలో దోర్నాల ఏపీటీడబ్ల్యూఆర్ (బా లురు) విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ విభాగాలలో పాఠశాలకు చెందిన 17 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తులసీనాయక్ బుధవారం ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 28, 29న ఎర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయి పోటీలు అమానుగుడిపాడులో నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో వాలీబాల్‌లో బాలూనాయక్, చంటి, రోహిత్ నాయక్, కబడ్డీలో తులస్యనాయక్, త్రోబాల్‌లో శివానాయక్, సాయినాయక్, శ్రీనివాస నాయక్, వెంకటేశ్ నాయక్, అండర్ 14 విభాగంలో కబడ్డీలో ధనరాజ్‌నాయక్, వాలీబాల్‌లో అఖిల్ నాయక్, లక్ష్మానాయక్, త్రోబాల్‌లో ధనరాజ్, బాలాజీ, తిరుపతి, రాంచరణ్‌తేజ్, అఖిల్, లక్ష్మానాయక్ గెలుపొంది జిల్లా స్థాయికి ఎంపికయినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులను ఉఫాధ్యాయ సిబ్బంది అభినందించారు.