వైసీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం అధోగతి

ABN , First Publish Date - 2022-12-30T23:07:49+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి చేస్తున్న విధ్వంసకర పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విమర్శించారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ 2019 మే 30న జగన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు, వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు

వైసీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం అధోగతి
వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఉగ్ర, నేతలు

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, డిసెంబరు 30 : సీఎం జగన్‌రెడ్డి చేస్తున్న విధ్వంసకర పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విమర్శించారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ 2019 మే 30న జగన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు, వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని, ఏడాదికో జాబ్‌క్యాలెండర్‌ ఇస్తామని నిరుద్యోగుల్ని నిండా మోసగించిన ఘనత జగన్‌రెడ్దిదేనని విమర్శించారు. నిరుద్యోగులు తల్లితండ్రులపై ఆధారపడకుండా, వారి కనీస ఖర్చులకు ఉపయోగపడేలా నెలకు 3వేలు నిరుద్యోగ భృతి చంద్రబాబు ఇస్తే, దానిని కూడా జగన్‌రెడ్డి రద్దు చేయడం దుర్మార్గమని చెప్పారు. రాష్ట్రంలో యథేశ్ఛగా డ్రగ్స్‌, గంజాయి, మద్యం అక్రమ విక్రయాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు భయాందోళనలు చెందుతున్నారని చెప్పారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జనవరి 27 నుంచి కుప్పం నుంచి చేపట్టనున్న పాదయాత్ర పోస్టర్లను ఉగ్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీవీఆర్‌ మనోహరరావు, భేరి పుల్లారెడ్డి, పట్టణ టీడీపీ అద్యక్షుడు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లుయాదవ్‌, మండల పార్టీ కన్వీనర్‌ పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, ఎస్సీసెల్‌ నాయకులు బుల్లా బాలబాబు, ముచ్చుమూరి చెంచిరెడ్డి, పట్టణ తెలుగుయువత అధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, చినరామిరెడ్డి, అహ్మద్‌, కోటపాటి శేషయ్య పాల్గొన్నారు.

వెలిగండ్ల : టీడీపీ నేత నారా లోకేశ్‌ చేపట్టబోయే యువగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెలిగండ్ల మండల పార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మౌలాలి, కె. వెంకటేశ్వర్లు, సలోమన్‌రాజు, మోటాటిసుబ్బారెడ్డి, పోకల పుల్లారెడ్డి, జి. సుబ్రమణ్యం, గోనా వెంకటయ్య, నాగరాజు, మనోహర్‌, ముక్క వెంకటేశ్వరరెడ్డి, యడ్ల అనిల్‌, చిన్ని, నారాయణ, మాల్యాద్రి పాల్గొన్నారు.

పాదయాత్రలో నేరుగా లోకే్‌షను కలుసుకునేందుకు మిస్డ్‌కాల్‌

దొనకొండ, డిసెంబరు 30 : టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పేరుతో చేపట్టనున్న పాదయాత్రలో అతన్ని నేరుగా కలిసి సమస్యలు చెప్పుకునేందుకు 9686296862 నెంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలని మండల టీడీపీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, నెరవేర్చని హామీలు తదితర అంశాలను శివకోటేశ్వరరావు చదివి వినిపించారు. మెరుగైన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటే ధ్యేయంగా యువగళం పేరుతో కుప్పం నుంచి నాలుగువేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టేందుకు సంసిద్ధమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీసభ్యుడు పులిమి రమణాయాదవ్‌, నాయకులు నిమ్మకాయల సుబ్బారెడ్డి, కొమ్మతోటి సుబ్బారావు, షేక్‌ తోహిద్‌, పత్తి వెంకటేశ్వర్లు, యరగొర్ల బసవయ్య, తోటా వెంకటేశ్వర్లు, శృంగారపు నాగసుబ్బారెడ్డి, ఫణిదపు వీరాంజనేయులు, పెమ్మసాని లక్ష్మీనారాయణ, వల్లపునేని కేశవ, పీ సత్యానందం పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:07:49+05:30 IST

Read more