ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రతరం

ABN , First Publish Date - 2022-03-05T06:34:12+05:30 IST

దర్శి ప్రాంతంలో ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంకావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రతరం
ఆటోల్లో వెళ్తున్న ప్రయాణికులు

ప్రమాదభరితంగా మారిన ఆటో ప్రయాణం
దర్శి, మార్చి 4 :
దర్శి ప్రాంతంలో ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంకావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌ కూడలిలో గంటల తరబడి బస్సుల కోసం వేచి ఉండాల్సివ స్తోంది. అత్యవసరంగా వెళ్లే ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాలకు కూడా ఆటోల్లో వెళ్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిం చుకొని ఆటోలు వెళ్తుండడంతో ప్రమాదాలభారిన పడుతున్నారు. దర్శి ప్రాంతానికి గత ఏడాది నుంచి ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులను అధికశాతం నిలిపివేశారు. దర్శి నుంచి అద్దంకి, వినుకొండ, పొదిలి వైపు వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు బస్సులను నిలిపివేయటంతో ప్రయాణికులతో పాటు విద్యార్ధులు ఆటోల్లో దర్శి రావాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో దర్శి-సామంతపూడి, దర్శి-ఆరవళ్లిపాడు, దర్శి-జముకులదిన్నె, దర్శి-పోతవరం తదితర రోడ్ల లో ఆర్టీసీ బస్సులు నడిచేవి. ప్రస్తుతం ఆ బస్సులను నిలిపేయడంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో ఆటో ప్రయాణం ప్రమాదభరితంగా మారిం ది. ఓవర్‌ లోడ్‌తో వస్తున్న ఆటోలు గుంటల్లో పడిపోతుండటంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. దర్శిలో ఆర్టీసీ డిపో లేకపోవటంతో ఇతర ప్రాంతాల డిపోలపై ఆదారపడాల్సి వస్తోం ది. దర్శికి ఆర్టీసీ డిపో మంజూరు అయిన విషయం తెలిసిందే. అందువలన ఆర్టీసీ డిపో వీలైనంత త్వరగా నిర్మించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-03-05T06:34:12+05:30 IST