కార్మిక వర్గంపై కక్షసాధింపు వీడాలి

ABN , First Publish Date - 2022-10-31T23:33:04+05:30 IST

కార్మిక వర్గంపై కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కక్షసాధింపు చర్యలను ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పీవీఆర్‌ చౌదరి డిమాండ్‌ చేశారు.

కార్మిక వర్గంపై కక్షసాధింపు వీడాలి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పీవీఆర్‌ చౌదరి

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 31 : కార్మిక వర్గంపై కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కక్షసాధింపు చర్యలను ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పీవీఆర్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. ఒంగోలు ముఠా కా ర్యాలయం వద్ద సోమవారం ఏఐటీయూసీ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా కార్మికోద్యమ నేత గరుదాస్‌ దాస్‌ గుప్తా చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు హమాలీ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి సుభాన్‌ నాయుడు ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో చౌదరి మాట్లా డుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్పొరేట్‌ బ హుళజాతి సంస్థలకు కారు చౌకకగా బానిసలుగా కట్టబెడుతున్నారని ఆరో పించారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యూలర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో కార్మికులతో కలిసి ఉ ద్యమాలను మరింత ఉధృతం చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. ఏఐ టీయూసీ నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడమే కాకుండా కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో బోడపాటి సుబ్బారావు, పీవీ కృష్ణారావు, ఎద్దు రమేష్‌, జి.సుధాకర్‌, కే ఆనంద్‌, గంగయ్య, ఎ.వెంకటేశ్వర్లు, ఎస్‌కే అ సాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-10-31T23:33:06+05:30 IST