భార్యను హతమార్చిన భర్త
ABN , First Publish Date - 2022-04-16T05:09:05+05:30 IST
అనుమానంతో భార్యను రాయితో తలపై మోదీ హతమార్చిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈఘటన మండలంలోని చెంచుకుంట గిరిజనగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూడెంకు చెందిన ఆర్పీ వెంకటేశం భార్య మంతమ్మపై అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి భార్యను ఊరికి దూరంగా తీసుకెళ్లి రాయితో తలపై మోది హత్య చేశాడు.
పెద్దదోర్నాల, ఏప్రిల్ 15: అనుమానంతో భార్యను రాయితో తలపై మోదీ హతమార్చిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈఘటన మండలంలోని చెంచుకుంట గిరిజనగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూడెంకు చెందిన ఆర్పీ వెంకటేశం భార్య మంతమ్మపై అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి భార్యను ఊరికి దూరంగా తీసుకెళ్లి రాయితో తలపై మోది హత్య చేశాడు. అనంతరం గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు భార్యను చంపినట్లు చెప్పి వెంకటేశం పరారయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు.