వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి
ABN , First Publish Date - 2022-12-16T22:42:39+05:30 IST
రాష్ట్రంలో ఆరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వా నికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలం లోని సీతానాగులవరం, సూరెపల్లి గ్రామాల్లో ‘ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తర్లుపాడు, డిసెంబరు 16: రాష్ట్రంలో ఆరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వా నికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మండలం లోని సీతానాగులవరం, సూరెపల్లి గ్రామాల్లో ‘ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అదే సమయంలో ప్రజల సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించేందుకు పోరాడాల న్నారు. వైసీపీ నుంచి ఎదురయ్యే దాడులను కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోని నెట్టిందన్నారు. ప్రజలపై విద్యుత్, ఇసుక, సిమెంట్, గ్యాస్ వంటి ధరలను మోపార న్నారు. అనంతరం ఇటీవల మాండస్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న మిర్చిని పరిశీలించారు. మిర్చి, పొగాకు, కంది రైతులు తుఫాన్ దాటికి తీవ్రంగా నష్టపోయారన్నారు. తక్షణమే ప్రభుత్వం నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపురెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పి.గోపినాథ్ చౌదరి, సాదం వీరయ్య యాదవ్, కూచిపూడి సోమయ్య, నాయకులు మేకల వెంకటనారాయణ, భోగినేని చిరంజీవి, నంబూల లక్ష్మయ్య, నరసింహులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
పొదిలి రూరల్ : రాష్ట్రానికి పట్టిన ఖర్మే వైసీపీ అని దాన్ని వదిలించుకునేందుకు సిద్ధంగా ఉండాలని మార్కాపురం మాజీ శాసనసభ్యలు కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని బుచ్చన పాలెం గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పనితీరును చూసి రాబోవు ఎన్నికల్లో ఓట్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, నాయకులు ముల్లా ఖుద్దూస్, కాటూరి పెదబాబు, యర్రంరెడ్డి వెంకటేశ్వరెడి, శివాలయం సామంతపూడి నాగేశ్వరరావు, ఠాగూర్, కాటూరి శ్రీను, షేక్ మహమ్మద్ అలి తదితరులు పాల్గొన్నారు.