అద్దంకిని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-12-31T23:22:10+05:30 IST
అద్దంకి పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యమని శాప్‌నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. పట్టణం లోని దర్శి రోడ్డులో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్‌ను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు.
వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి కృష్ణచైతన్య
అద్దంకి, డిసెంబరు 31: అద్దంకి పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దటమే లక్ష్యమని శాప్‌నెట్ చైర్మన్, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. పట్టణం లోని దర్శి రోడ్డులో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్‌ను శనివారం రాత్రి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ త్వరలో దర్శి రోడ్డులో గ్రీనరీ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణం లో మిగిలిన ప్రధాన రోడ్లలో కూడా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేస్తామ న్నారు. కార్యక్రమం లో చైర్‌పర్సన్ ఎస్తేరమ్మ, వైస్‌చైర్మన్‌లు పద్మేష్, అ నంతలక్ష్మి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్, కౌన్సిల ర్‌లు యేజెండ్ల నాగరాజు, మేడం రమణ, బాలు, బాషా, పూనూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర వేడుకలకు భారీ ఏర్పాట్లు
నూతన సంవత్సర వేడుకలను భారీగా నిర్వహించేందుకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు. పట్టణం మొత్తం వైసీపీ ఫ్లెక్సీలతో నిం డిపోయింది. ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డును మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. బంగ్లా ఆవరణలో జరిగే నూతన సంవత్సర వేడుకలకు కృష్ణచైతన్య హాజరుకానున్నారు.