హెచ్‌ఐవీ మందుల కొనుగోలుకు టెండర్లు

ABN , First Publish Date - 2022-01-13T06:15:18+05:30 IST

రెండు నెలలుగా పట్టీపట్టనట్లు వ్యవహరించిన వైద్యారోగ్యశాఖ మందుల కొనుగోలుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీల నుంచి టెండర్లు కోరింది.

హెచ్‌ఐవీ మందుల కొనుగోలుకు టెండర్లు

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 12: రెండు నెలలుగా పట్టీపట్టనట్లు వ్యవహరించిన వైద్యారోగ్యశాఖ మందుల కొనుగోలుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీల నుంచి టెండర్లు కోరింది. గత రెండునెలలుగా జిల్లాలోని హెచ్‌ఐవీ బాధితులకు మందులు లేవు. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ నిధులున్నా మందులు కొనుగోలు చేయకపోవడంతో హెచ్‌ఐవీ బాధితులు ఇబ్బందులను తెలియజేస్తూ ‘ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా’ శీర్షికన ఆంధ్రజ్యోతి గత ఆదివారం కథనం ప్రచురితమైం ది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించడంతో వైద్యారోగ్య శాఖ అధికారు లు మందుల కొనుగోలుకు చర్యలు చేపట్టారు. వెంటనే ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానించారు.ఈనెల 12 నుంచి 18వ తేదీలోపు టెండర్‌కు దరఖాస్తు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-13T06:15:18+05:30 IST