ఉపాధ్యాయురాలు అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-10-07T06:32:27+05:30 IST

కొత్తపట్నం జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యా యురాలుగా పని చేస్తున్న పనిచేస్తున్న తొట్టెంపూడి రాజ్యలక్ష్మి (55) అనుమానా స్పద రీతిలో మృతి చెందిన సంఘటన ఒంగోలు నగరం దేవుడుచెరువులో బుధవారం జరిగింది.

ఉపాధ్యాయురాలు అనుమానాస్పద మృతి



ఒంగోలు(క్రైం), అక్టోబరు 6: కొత్తపట్నం జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యా యురాలుగా పని చేస్తున్న  పనిచేస్తున్న తొట్టెంపూడి రాజ్యలక్ష్మి (55) అనుమానా స్పద రీతిలో మృతి చెందిన సంఘటన ఒంగోలు నగరం దేవుడుచెరువులో బుధవారం జరిగింది. ఒంగోలు వన్‌టౌన్‌ ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి అ నుమానాస్పద కేసుగా నమోదు చేశారు. వివరాలలోకి వెళితే.. రాజ్యలక్ష్మికి ఇరువురు సంతానం. భర్త మృతి చెందాడు. కుమార్తెకు వివాహం అయింది. కుమారుడు విదేశాలలో ఉంటున్నాడు. దీంతో ఆమె తన ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. ఇటీవల ఇంటి మరమ్మతులు చేయిస్తుండడంతో పై అంతస్తు ఖాళీగా ఉంది. ఈ నేపధ్యంలో గురువారం ఉందయం ఇంటికి రంగులు వేసే వారు వచ్చి రాజ్యలక్ష్మిని తలుపు తీసేదుకు పిలిచారు. ఎంత సేపటికీ రాలేదు. దీంతో గేటు ఎక్కి కిచెన్‌ రూంలోకి వెళ్లే సరికి ఆమె అక్కడ కింద పడి ఉండటం గుర్తించి వెంటనే ఆమె సోదరుడు శ్రీకాంత్‌కు ఫోన్‌ చేశారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం తలుపు వేసి ఉన్నప్పటకి మిగిలిన తలుపులు తీసి ఉన్నాయి. అంతేగాకుండా ఆమె మెడ చుట్టూ స్వల్పగా యాలు ఉన్నాయి. ఆమె వినియోగిచే సెల్‌ఫోన్‌ కనిపించలేదు. స్విచాఫ్‌ చేసి ఉంది. దీంతో రాజ్యలక్ష్మి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ సోదరుడు పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చన తరువాత ని జాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Updated Date - 2022-10-07T06:32:27+05:30 IST