మహానాడుకు తరలిన టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-05-28T05:02:13+05:30 IST

రానున్న ఎనికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. మ హానాడు కార్యక్రమానికి శుక్రవారం శ్రేణులతో కలసి వెళ్లారు.

మహానాడుకు తరలిన టీడీపీ శ్రేణులు
కనిగిరి నుంచి మహానాడుకు తరలివెళ్తున్న శ్రేణులు

వాహనాల్లో ఒంగోలుకు

నేటి బహిరంగ సభకు భారీగా వెళ్లనున్న తమ్ముళ్లు

కనిగిరి, మే 27: రానున్న ఎనికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. మ హానాడు కార్యక్రమానికి శుక్రవారం  శ్రేణులతో కలసి వెళ్లారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారన్నారు.  ధరల మోత, చార్జీల వాతతో నడ్డివిరుస్తున్నారని ధ్వజ మె త్తారు. నియోజకవర్గంలో డాక్టర్‌ ఉగ్ర సారథ్యంలో టీడీపీ విజయానికి అం దరూ పాటుపడాలన్నారు. తొలుత  కాశిరెడ్డి కాలనీ దగ్గర  మహానాడుకు బయలుదేరిన ర్యాలీని ప్రారంభించారు.  

పామూరులో..

పామూరు :  మహానాడు సభకు పామూరు నుంచి టీడీపీ నా యకులు, కార్యకర్తలు శుక్రవారం తరలివెళ్లా రు. శనివారం జరిగే బహిరంగ సభకు 50 వాహ నాల్లో తరలివస్తారని టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు తెలి పారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు ఏలూరి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ  మాల్యాద్రి చౌదరి,  టీడీపీ రాష్ట్ర బీసీ సంఘ ఉపాధ్యక్షుడు గంగరాజు, తెలుగు రైతు కార్య నిర్వాహక కార్యదర్శి చిన్న చెంచయ్య, ఒంగోలు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి ప్రసాద్‌ రెడ్డి తొలిరోజు కార్యక్రమానికి తరలివెళ్లారు. 

సీఎస్‌పురంలో..

సీఎస్‌పురం : ఒంగోలులో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభకు టీడీపీ మండల టీడీపీ ముఖ్యనాయకులు శుక్రవారం బయలు దేరి వెళ్లారు. సభకు వెళ్లిన వారిలో మండల పార్టీ అధ్య క్షుడు బొమ్మనబోయిన వెంగయ్య, సర్పంచ్‌ శ్రీరాం పద్మావతి, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మన్నేపల్లి శ్రీనువాసులు, మాజీ సర్పంచ్‌ పునుగుపాటి రవికుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పోకల రవి చంద్ర, కనిగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి,  రమేష్‌,  రామకృష్ణంరాజు, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

పీసీపల్లిలో..

పీసీపల్లి : 18 పంచాయతీల నుంచి నాయకులు, కార్యకర్తలు తమ సొంత వాహనాల్లో మహా నాడుకు తరలివెళ్లారు. పసుపు రంగ ష ర్టులు ధరించి, జెం డాలు చేతబూని హుషారుగా పయనమయ్యారు. టీ డీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఉపా ధ్యక్షుడు గడ్డం బాలసుబ్బయ్య, మండల అధ్యక్షుడు వేమూరి రా మయ్య, సీనియర్‌ నాయకుడు బండారు వెంకట్రావు, శ్రీనివాస కుమార్‌ సర్పంచ్‌లు తిరుపత య్య, శాంసన్‌, మల్లికార్జున, సు బ్బరాయుడు, తిరుపతమ్మ, తెలు గు యువత అధ్యక్షుడు నా గేంద్ర బాబు తరలివెళ్లినవారిలో ఉన్నారు. 

ముండ్లమూరులో..

ముండ్లమూరు :  మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో మహా నాడుకు తరలివెళ్లారు. మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, దర్శి నియోజక వర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మేదరమెట్ల వెంకటరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీలు వరగాని పౌలు, నాగరాజు, సర్పంచ్‌లు నారాయణస్వామి, సుబ్బారెడ్డి, పలువురు వృద్ధులు పాల్గొన్నారు. దర్శి నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జి పమిడి రమేష్‌ ఆధ్వర్యంలో మహానాడుకు  తరలివెళ్తున్న ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జరిగే బహిరంగ సభకు ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్లేవారంతా భోజనాలు చేసిన అనంతరం బయలు దేరుతారు. ఆ ఏర్పాట్లను నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మేదరమెట్ల వెంకటరావు పరిశీలించారు. 

దొనకొండలో..

దొనకొండ :  ఒంగోలు శనివారం జరిగే మహానాడు బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ మండలాధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వర రావు కోరారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

తాళ్లూరులో..

తాళ్లూరు : మహానాడుకు తాళ్లూరు తమ్ముళ్లు బయలుదేరారు. ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్‌ కాలేషావలి, ఒంగోలు పార్లమెంట్‌ టీ డీపీ కార్యనిర్వహక కార్యదర్శులు శాగం కొండారెడ్డి, మానం రమేష్‌బాబు, వల్లభనేని సుబ్బయ్య,  నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్‌ మీ రామెహిద్దీన్‌, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, కోటిరెడ్డి, సుబ్బారెడ్డి, బి.ఓబుల్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుబ్బారావు, లక్ష్మినారాయణ ఒంగోలు తరలివెళ్లారు. కాగా శనివారం జరిగే మహానాడు ముగింపు బహిరంగ సభకు భారీగా రావాలని నాయకులు పిలుపునిచ్చారు. 

సుహాసినితో పామూరు తెలుగు మహిళలు

తెలుగు మహిళా సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఎన్టీఆర్‌ మనవరాలు సుహాసిని కోరారు. మహానాడుకు వచ్చిన పామూరు తెలుగు మహిళలు సుహాసినిని కలిసి సంఘ అభివృద్ధిపై చర్చించారు. పామూరుకు చెందిన మాజీ జడ్పీటీసీ  మహా లక్ష్మమ్మ, దేవరపు రమణమ్మ,  సుశీల, వార్డు మెంబర్‌ శేషమ్మ, రమణమ్మ, రమాదేవి రహీమున్నీసా, యూర్‌బీ ఈశ్వరమ్మ,  సుబ్బమ్మ పాల్గొన్నారు. 
Updated Date - 2022-05-28T05:02:13+05:30 IST