టీడీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ల బాట
ABN , First Publish Date - 2022-08-05T04:57:48+05:30 IST
జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం పార్టీశ్రేణులు గురువారం పోలీస్ స్టేషన్ల బాట పట్టారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చే శారు. ఇటీవల ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోగా అందుకు నారా లోకేష్ కారణం అంటూ దేవెందర్‌రెడ్డి కట్టుకథలు అల్లి అనుచిత వ్యాఖ్యలు, నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు.
దేవేందర్‌రెడ్డిపై చర్యలు కోరుతూ ఫిర్యాదులు
లోకేష్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని మండిపాటు
ఒంగోలు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం పార్టీశ్రేణులు గురువారం పోలీస్ స్టేషన్ల బాట పట్టారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చే శారు. ఇటీవల ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోగా అందుకు నారా లోకేష్ కారణం అంటూ దేవెందర్‌రెడ్డి కట్టుకథలు అల్లి అనుచిత వ్యాఖ్యలు, నిరాధారమైన నిందారోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది ఎవరన్నది ప్రజలందరికి తెలుసునని నందమూరి, నారా కుటుంబాలకు వాటిని ఆపాదించే ప్రయత్నం మానుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, లక్ష్మీపార్వతి ప్రకటనలపైనా టీడీపీశ్రేణులు మండిపడుతున్నారు. కార్యక్రమంలో ఒంగోలుకు చెందిన కుసుమకుమారి, అరుణారెడ్డి, ఆర్ల వెంకటరత్నం, పావని, గంగవరపు పద్మ పాల్గొన్నారు. అలాగే వైపాలెం, పొదిలి, కనిగిరి, పలు ఇతర ప్రాంతాల్లో తెలుగు మహిళా, యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ సోషల్ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు.