కళా ఉత్సవ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2022-12-07T22:04:44+05:30 IST

మైనంపాడు డైట్‌ కళాశాలలో మంగళ, బుధ వారాలలో జరిగిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌ పోటీల్లో ముండ్లపాడు జడ్పీ ఉన్నత పాఠశా ల విద్యార్థులు వివిధ విభాగాలలో విశేష ప్రతిభ కనపరిచారు. జిల్లా స్థాయి అవా ర్డులు సాధించారు.

కళా ఉత్సవ్‌ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

గిద్దలూరు, డిసెంబరు 7 : మైనంపాడు డైట్‌ కళాశాలలో మంగళ, బుధ వారాలలో జరిగిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌ పోటీల్లో ముండ్లపాడు జడ్పీ ఉన్నత పాఠశా ల విద్యార్థులు వివిధ విభాగాలలో విశేష ప్రతిభ కనపరిచారు. జిల్లా స్థాయి అవా ర్డులు సాధించారు. డ్రాయింగ్‌, త్రీడీ విజువల్‌ విభాగంలో ఏవీపీ ఆచారి, ఫోక్‌డ్యాన్స్‌ విభాగంలో పి.సాధివ్‌ , పాటల విభాగంలో షేక్‌ షాహిదా జిల్లా స్థాయి అవార్డులను సాధించారు. మోనోయాక్షన్‌ విభాగంలో జి.రంగనాయకులు, బొమ్మల తయారీ విభాగంలో సీహెచ్‌.వసంత్‌ జిల్లా స్థాయి అవార్డులు పొందడమే కాకుండా విజయవాడలో ఈనెల 12వ తేదీన జరుగనున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్‌ పోటీలకు ఎంపికయ్యారు. విజేతలైన వారికి జడ్పీ డిప్యూటీ ఈవో సామసుబ్బారావు, ముండ్లపాడు హైస్కూల్‌ హెచ్‌ఎం వి.గిరిధరశర్మ, డైట్‌ లెక్చరర్లు విజేతలకు అవార్డులు అందచేశారు. విద్యార్థులకు శిక్షన ఇచ్చిన పీహెచ్‌.ఖాన్‌, సుబ్రమణ్యంను అభినందించారు.

బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినుల ప్రతిభ

మార్కాపురం(వన్‌టౌన్‌) : జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు జానపద నృత్య, గీత పోటీలలో ప్రతిభ కనబర్చారని ప్రధానో పాధ్యా యులు శ్రీదేవి తెలిపారు. మైనంపాడులో జరిగిన కళాఉత్సవ్‌ 2022-23కు జిల్లా స్థా యి జానపదం సంగీతం, నృత్యంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థినులను, శిక్షణ ఇచ్చిన గురువు కాశింను అభినందించారు.

Updated Date - 2022-12-07T22:04:46+05:30 IST