రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-05T05:01:51+05:30 IST

ప్ర భుత్వపరంగా అందించే సంక్షేమ పథకాలను, సబ్సి డీ రుణాలను సద్వినియో గం చేసుకోవాలని ఆర్డీఓ సరోజని అన్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్న ఆర్డీవో సరోజిని

ఆర్డీవో సరోజిని

చీరాల, ఆగస్ట్టు 4: ప్ర భుత్వపరంగా అందించే సంక్షేమ పథకాలను, సబ్సి డీ రుణాలను సద్వినియో గం చేసుకోవాలని ఆర్డీఓ సరోజని అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం రెవె న్యూ, పోలీస్‌, మత్స్యశాఖ అధికారులు నియోజకవర్గ పరిధిలోని మ త్స్యకార సంఘాల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. సమావేశానికి వాడరేవు, రామాపురం, కఠారివారిపాలెం గ్రామాల నుం చి 44 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఫిషరీస్‌ జేడీ సురేష్‌ అధ్య క్షతన జరిగిన సమావేశంలో ఆర్డీఓ సరోజని మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నా రు. జేడీ సురేష్‌ మాట్లాడుతూ సబ్సిడీ రుణాలతో ఒనగూరే ప్రయోజ నాలను వివరిస్తూ పీఎంఎంఎస్‌వై(ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన) పథకం, తదితరాల గురించి వివరించారు. పలువురు  మత్స్యకా రులు మాట్లాడుతూ గతంకన్నా సబ్సిడీ రు ణాలకు ఇచ్చే సబ్సిడీ మొత్తం తగ్గించారని చెప్పారు. తాము రుణాలు తీసుకున్నా పెద్ద గా ప్రయోజనం ఉండదన్నారు. వచ్చే సబ్సి డీ  తిరుగుడు ఖర్చుకు సరిపో తుందని త మ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీఎస్పీ శ్రీకాంత్‌ మాట్లా డుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఎవరిపని వారు చేసుకోవాలని స్పష్టం చేశారు. ముందుగా నూతనం గా బాధ్యతలు స్వీకరించిన అధికారులు, మత్స్యకారుల మధ్య పరిచ య కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో చీరాల, వేటపాలెం మండ లాల తహసీల్దార్లు ప్రభాకరరావు, సంధ్యశ్రీ, ఈపురుపాలెం ఎస్సై జ నార్దన్‌, ఫిషరీస్‌ ఏడీ కృష్ణకిషోర్‌, ఎఫ్‌డీవో రాజ్‌కుమార్‌, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-05T05:01:51+05:30 IST