విద్యార్థులు పోటీతత్వం పెంచుకోవాలి
ABN , First Publish Date - 2022-12-07T22:19:13+05:30 IST
ప్రభుత్వ పాఠశాల విద్యా ర్థులు చదువులో పోటీతత్వం పెంచుకోవాలని అప్పుడే విజ యంతో ముందుకు సాగుతారని సబ్ కలెక్టర్ సేతుమాధవ న్ అన్నారు. బుధవారం మండలంఓలని చెరుకుపల్లె గ్రామాన్ని ఆయన సందర్శించారు.
బేస్తవారపేట, డిసెంబరు 7 : ప్రభుత్వ పాఠశాల విద్యా ర్థులు చదువులో పోటీతత్వం పెంచుకోవాలని అప్పుడే విజ యంతో ముందుకు సాగుతారని సబ్ కలెక్టర్ సేతుమాధవ న్ అన్నారు. బుధవారం మండలంఓలని చెరుకుపల్లె గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం కొత్తపేట హై స్కూల్‌కుకు వెళ్లిన ఆయన విద్యార్థుల సామర్థ్యాలను పరీ క్షించారు. నాడు-నేడు పనుల రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి చేశారు. వంటలు రుచిగా వుండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్ర కారం పిల్లలకు భోజనం శుచిగా, రుచిగా వండిపెట్టాలని ని ర్వాహకులకు సేతుమాధవన్ సూచించారు. ఆయనతోపాటు తహసీల్దార్ కె.శాంతి, ఎంపీడీవో చెన్న కేశవరెడ్డి, ఎంఈవో జింకా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భూములు పరిశీలించిన సబ్ కలెక్టర్
రాచర్ల : మండలంలోని యడవల్లి గ్రామ సమీపాన ఉన్న రైల్వేట్రాక్ పక్కనున్న భూములను మార్కాపురం సబ్ కలెక్టర్ మాధవన్ బుధవారం పరిశీలించారు. గుంటూరు నుంచి గుంతకల్లు వరకు డబుల్ లైన్ పనులు జరుగుతున్న దృష్ట్యా యడవల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైతుల భూములను పరిశీలించారు. డబుల్ లైన్ భూములను రైతుల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, ఆర్‌ఐ గంగిరెడ్డి, వీఆర్‌వోలు పద్మ, రంగస్వామి, సూరి, వెంకటరమణ పాల్గొన్నారు.